పెద్దపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో లోని ఇటీవల కాలంలో ఏసీబీ (ACB) దాడుల్లో అవనీతికి పాల్పడే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణం ఎస్ఆర్‌సీ నీటి పారుదల శాఖ (Irrigation ) అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్యక్తి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్టర్‌కు ఓ బిల్లు విషయంలో ఏఈ నర్సింగరావుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్టర్ రూ.20,000లు అందజేశారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయన్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
2 thoughts on “ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత”