Agniveer registrations : భారత ఆర్మీ (Indian Army) ఆధ్వర్యంలో అమలవుతున్న అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద అగ్నివీర్ నియామక ప్రక్రియ (2025-26) కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 2025 మార్చి 12న ప్రారంభం కాగా 2025 ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది.
Agniveer registrations : నియామక విధానం
ఈ నియామక ప్రక్రియ (recruitment process)లో అగ్నివీర్ అభ్యర్థులు (Agniveer candidates) ఐదు విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
1.జనరల్ డ్యూటీ (General Duty)
2.టెక్నికల్ (Technical)
3.క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (Clerk/Store Keeper Technical)
4.ట్రేడ్స్‌మన్ (Tradesman) – (పదో తరగతి లేదా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు)
- మహిళా జనరల్ డ్యూటీ (Women General Duty in Corps of Military Police)
అర్హతల ఆధారంగ అగ్నివీర్ అభ్యర్థులు ఈ ఐదు విభాగాల్లో ఏదైనా రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం
- వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు (Agniveer candidates) కనీసం ఎనిమిది, పదో తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
- లోకల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (local recruitment rally)లలో పాల్గొనాలంటే అభ్యర్థులు మొదట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
నియామక ప్రక్రియ ఇలా..
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అభ్యర్థులు 2025 మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE): అగ్నివీర్ నియామకానికి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష 2025 జూన్ నెలలో నిర్వహించే అవకాశముంది. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తారు.
- ఈ పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు (ఇంగ్లిష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒడియా, బెంగాలి, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ).
- స్థానిక నియామక ర్యాలీ: ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్థానిక స్థాయిలో ర్యాలీ నిర్వహించి ఫిజికల్ టెస్టులు (Physical Tests) నిర్వహిస్తారు.
- మెడికల్ టెస్టు & డాక్యుమెంట్ వెరిఫికేషన్: అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, సంబంధిత డాక్యుమెంట్లను ధ్రువీకరిస్తారు.
అగ్నివీర్ శిక్షణ వ్యవధి
అగ్నివీర్ అభ్యర్థుల (Agniveer candidates)కు 31 వారాల పాటు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. దీనిలో ఫిజికల్ ఫిట్నెస్, డిఫెన్స్ ట్రైనింగ్, ఆయుధ ప్రాథమిక వినియోగం వంటి అంశాలు ఉంటాయి.
ఉద్యోగ భద్రత
అగ్నిపథ్ పథకం (Agnipath scheme) ప్రకారం అగ్నివీర్లకు నాలుగు సంవత్సరాల పాటు భారత ఆర్మీలో సేవ చేసే అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల సేవ ముగిసిన తర్వాత భారత ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతి బ్యాచ్‌లోని 25% మంది అగ్నివీర్లకు రెగ్యులర్ క్యాడర్ ఉద్యోగం లభించనుంది. మిగిలిన 75% మంది అగ్నివీర్లకు ప్రత్యేక పథకాల ద్వారా ఇతర ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
ప్యాకేజీ, లబ్ధి
నాలుగేళ్లలో అగ్నివీర్లకు ఆకర్షణీయమైన వేతనం, భద్రతా నిధి (Seva Nidhi Package) వంటి ప్రయోజనాలు అందించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..