Anaganaga Movie Review | తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు విభిన్నమైన క్యారెక్టర్ లు చేస్తూ వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారు అనుకున్న కథను తెరపైకి తీసుకొస్తుంటారు.అలాంటి మూవీస్ చేసి తన కంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు సుమంత్(sumanth). మొదటి మూవీనే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)డైరెక్షన్ లో చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్ తీసి మంచి మెప్పించిన సుమంత్ కెరీర్ గాడి తప్పింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిన తనకు నచ్చిన మూవీనే తీసుకుంటూ వచ్చాడు. తను సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది.కొన్ని మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. పూర్తిగా తన మార్కెట్ డౌన్ ఫాలో అయిందనుకుంటుండగా ఈటీవీ విన్ లో అనగనగా (anaganaga)అనే మూవీని రిలీజ్ చేశారు. క్రిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై(krishi entertainment bannar)రాకేష్ రెడ్డి,రుద్ర (Rakesh Reddy, rudra) ప్రొడ్యూసర్లుగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది.
Anaganaga Movie : స్టోరీ…
వ్యాస్ ఒక స్కూల్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తుంటా డు. అతడి కొడుకు అదే స్కూల్ లో చదువుతుంటాడు. వ్యాస్ వైఫ్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తుంది. వ్యాస్ కి అక్కడ బట్టి పట్టే చదువులు నచ్చవు. ర్యాంక్ లు మాత్రమే చూసే ఆ స్కూల్ కి రిజైన్ చేసి తనే ఓ స్కూల్ పెట్టాలనుకుంటాడు. తను అనుకున్నది నెరవేరిందా..? ఈ క్రమంలో ఏమైంది..?అనేది మిగతా కథ.
మూవీ ఎలా ఉందంటే..
ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా మూవీస్ వచ్చాయి.కానీ ఈ మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేయని విధంగా ఉంది. ఫస్ట్ సీన్ చూడగానే మంచి ఎమోషనల్ మూవీ అని తెలిసిపోతుంది.స్కూల్లో పిల్లలు చదువులో వెనుకపడే కారణాలను, అలా వెనుకబడి ఉన్న విద్యార్థులకు నచ్చే విధంగా ఎలా చెప్పాలి అనే పాయింట్ బాగా చూపించారు. స్కూల్ లో స్టూడెంట్స్ పై ర్యాంకుల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం ఆడియన్స్ ను ఆలోచింపచేసేలా ఉంది.ఇక సెకండాఫ్ స్టోరీ లో మరింత ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇవి ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించేలా ఉన్నాయి.
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
Anaganaga Movie Review | అనగనగా టైటిల్ కు తగ్గట్టుగా డైరెక్టర్ సన్నీ సంజయ్ (sanni Sanjay)మంచి కథను చెప్పారు. థియేటర్ లో ఈ మూవీ వస్తె ఆడియన్స్ ఆదరించేవారు.కానీ మూవీ టీం ఓటీటీ లో రిలీజ్ చేసి అంతకంటే ఎక్కువ మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారనడంలో సందేహం లేదు. ప్రతీ సీన్ కూడా హృదయానికి హత్తుకునేలా తీశారు.ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సీన్స్ ను రాసుకోవడమే కాదు వాటిని అంతే బాగా తెరపై తీసుకొచ్చాడు. ఆర్టిస్టుల అందరితో మంచి పర్ఫామెన్స్ ను రాబట్టుకోవడంలో సఫలం అయ్యాడని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇక హీరో సుమంత్ కెరీర్ లో ఒక మంచి మూవీగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.నటుడిగా మరో మెట్టు ఎక్కించేలా తన పెర్ఫార్మెన్స్ ఉంది.ఎమోషనల్ సీన్స్ లో చాలా నాచురల్ గా యాక్ట్ చేశాడు. ఆడియన్స్ హార్ట్ కు టచ్ అయ్యేలా చేశాడు. హీరోయిన్ కాజల్ చౌదరి(kajal choudari)కి మొదటి మూవీనే అయిన అలా అనిపించలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఆకట్టుకునేలా ఉన్నాయి.వీరికి కొడుకుగా యాక్ట్ చేసిన అబ్బాయి యాక్టింగ్ ఆడియన్స్ ను మెప్పించింది.అలాగే మిగతా నటీనటులు వారి వారి పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు. చందు రవి(Chandu Ravi) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ను ఎలివేట్ చేశాయి. పాటలు కూడా బాగానే ఉన్నాయి.నిర్మాణ విలువలు బాగున్నాయి. పవన్ పప్పుల(Pawan pappula)సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బానే ఉంది. ఓవరాల్ గా మూవీ అందరూ ఆలోచించే విధంగా ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.