Anganwadi Egg Biryani | వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers ) తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే థీమ్‌తో నిర్వహించిన ర్యాలీల్లో చిన్నారులకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు మొదటిరోజు చిన్నారులకు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ (Egg Biryani in Anganwadi centers)’ ని మధ్యాహ్న భోజనంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం.
Egg Biryani : అంగన్ వాడీల్లో వెరైటీ ఫుడ్
ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు తగినట్లుగా ఆహారంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.. చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పిల్లలకు ఎగ్ బిర్యానీ, స్నాక్స్ గా పల్లీపట్టీలు అందిస్తోంది.
ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు, హాజరు శాతం పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. టేస్ట్, న్యూట్రిషన్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తూ అంగన్వాడీలపై పిల్లలు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందన్న విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హైదరాబాదు (Hyderabad) లోని సైదాబాద్ లో గల సింగరేణి కాలనీలో అంగన్వాడి కేంద్రంలో వడ్డించిన ఎగ్ బిర్యానినీ చిన్నారులు ఎంతో ఎంజాయ్ చేశారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో కనీసం కోడిగుడ్లను కూడా ఇవ్వడం లేదు. అలాంటిది తెలంగాణలో ఏకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.