Sarkar Live

Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన

Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో

Anganwadi
  • వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ
  • దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు
  • మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క‌

Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథ‌న సదస్సు 2025 జ‌రిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహారాన్ని ఇష్టంగా రుచి చూశారు. స్వచ్ఛమైన ఆదివాసీల ప్ర‌ద‌ర్శించిన అంగన్వాడీ సిబ్బందినిమంత్రి సీతక్క‌ అభినందించి ఫోటోలు దిగారు.

ఈసంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. బడి గంట మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్ ను తీసుకురావాల‌ని, అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం వల్ల చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయన్నారు. మినీ అంగన్వాడీ టీచర్లకు ప‌దోన్న‌తులు క‌ల్పించాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రెట్టింపు చేశాం. పంచాయతీరాజ్ శాఖలో 93 వేల మంది చిరు గ్రామీణ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ లో జీతాలు ఇస్తున్నాం. అదే ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్ లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తాన‌ని మంత్రి సీత‌క్క హామీ ఇచ్చారు.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ (Anganwadi Recruitment) చేస్తామని, ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైందని. త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నామని, సెల్ఫీ విత్ అంగన్వాడీని విజయవంతం చేయాలని. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని తెిాపరు
అంగన్వాడీ లబ్ధిదారులకు అందిస్తున్న కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. కోడి గుడ్డును ఉడకబెట్టి అలాగే ఇవ్వకుండా.. రెండు ముక్కలు చేసి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

Anganwadi Schools : వారంలో రెండు సార్లు ఎగ్ బిర్యానీ

అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న ఆహారం భోజనాన్ని మరింత రుచికరంగా మారుస్తామ‌ని మంత్రి సీత‌క్క అన్నారు. వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ (Egg Biryani) వడ్డించేలా మెనూ మారుస్తాం. మనకున్న బడ్జెట్ లో అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలతో ఆట వస్తువులు, అభ్యాసన మెటీరియల్ ను రూపొందించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున వయోవృద్ధులకు, ట్రాన్స్ జెండర్ల ఆత్మగౌరవాన్నీ పెంపొందించే చర్యలు చేపట్టామని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version