Sarkar Live

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి.

TG LAWCET & PGLCET-2025

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది.

AP CETs 2025 Schedule : పూర్తి వివ‌రాలు ఇవే..

  • పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్‌ సెట్‌ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు.
  • మే 6న‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్‌ (AP ECET)
  • మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్‌ (AP ICET)
  • మే 19 నుంచి 20 వ‌ర‌కు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET)
  • మే 21 నుంచి 27 వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET)
  • మే 25న ఏపీ లా సెట్‌ (AP LAWCET)
  • జూన్ 5, 6, 7 తేదీల్లో ఎంటెక్‌, ఎంఫార్మా కోర్సులకు ఏపీ పీజీఈ సెట్‌ (AP PGECET) 2025
  • జూన్ 8న‌ బీఈడీ కోర్సులకు ఏపీ ఎడ్ సెట్‌ (AP EdCET)
  • జూన్ 9 నుంచి 13 వ‌ర‌కు ఏపీ పీజీ సెట్‌ (AP PGCET)
  • జూన్ 25న బీపీఈడీ, యూజీ డీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఏపీ పీజీ సెట్‌ (AP PGCET) విద్యార్థులకు సూచ‌న‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్షలు ఎంతో ప్ర‌ధాన‌మైన‌వి. ఈ పరీక్షల్లో సాధించిన ర్యాంకు ఆధారంగా మంచి కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప్రిపేరైతే మంచి మార్కులు సాధించి సుల‌భంగా సీట్ల‌ను సాధించుకోవ‌చ్చ‌ని అంటున్నారు విద్యావేత్త‌లు.

  • సిలబస్ పూర్తిగా చదవాలి : ప్రతి విద్యార్థి తన కోర్సుకు సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా చదివి, ప్రతి అంశాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.
  • టైమ్ మేనేజ్‌మెంట్‌ (సమయ పాలన) త‌ప్ప‌నిస‌రి : ప్రతి రోజూ ఒక నిర్దిష్ట సమయ పట్టిక (Time Table) రూపొందించుకుని చదువుకోవాలి.
  • గ‌త‌ సంవత్సర ప్రశ్నపత్రాల (Previous Papers) ప‌రిశీల‌న : గత సంవత్సరం ప్రశ్నపత్రాలను ప‌రిశీలించి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
  • మాక్ టెస్టులు (Mock Tests) : ఆన్‌లైన్‌లో లభించే మాక్ టెస్టులు రాసి పరీక్షలో ఎదురయ్యే సమయ పరిమితిని అర్థం చేసుకోవాలి.
  • ఆరోగ్యం ప‌ట్ల జాగ్రత్త : ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.

AP CETs 2025 రిజిస్ట్రేష‌న్ కోసం..

అభ్య‌ర్థులు వివిధ ప‌రీక్ష‌ల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ https://www.apsche.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. ఏదైనా స‌మస్య ఏర్ప‌డితే ఈ-మెయిల్ support@apsche.ap.gov.in ద్వారా సంప్ర‌దించొచ్చు.

ప్రవేశ పరీక్షల హాల్ టికెట్

ఏపీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు పరీక్షకు కొన్ని రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • సంబంధిత పరీక్షకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ నంబర్ , జన్మతేదీ (DOB) నమోదు చేసి Submit చేయండి.
  • హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version