Artificial Intelligence : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో కీలక అడుగు వేసింది. మినిమం గవర్నమెంట్ – మాక్సిమమ్ గవర్నెన్స్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence -AI) పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన 20 విభాగాల్లోంచి AI చాంపియన్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌ను వధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (WGDT) తో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నారు
Artificial Intelligence : చాంపియన్లుగా సీనియర్ అధికారులు
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక అయ్యే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 80 శాతం కార్యకలాపాలను AI సాయంతో నిర్వహించేందుకు మార్గం సుగుమమైంది. ఏఐ చాంపియన్స్ అనే పేరుతో సీనియర్ అధికారులను ఎంపిక చేస్తారు. వీరితో పాటు Artificial Intelligence క్యాటలిస్ట్‌లు అనే మిడ్ లెవెల్ ఆఫీసర్లు సహకరిస్తారు. వీరు కలిసి శాఖలకు ప్రత్యేకంగా ఎదురయ్యే సవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పరిష్కారాలను ఆవిష్కరించనున్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కార్యదర్శి భాస్కర్ కటమనేని మాట్లాడుతూ ఈ అధికారులు WGDT, ఐటీ శాఖ సహకారంతో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ పొందుతారని తెలిపారు. ఈ శిక్షణలో వారు శాఖల సమస్యలను గుర్తించి, వాటికి AI ఆధారిత పథకాలుగా రూపకల్పన చేస్తారు. మొదటగా 100 నుంచి 150 వరకు AI ప్రాజెక్టులను Proof of Concept (PoC) స్థాయిలో అభివృద్ధి చేసి, అవి విజయవంతమైతే స్కేలబుల్ సొల్యూషన్లుగా మార్చే పనిలో నిమగ్నమవుతారు.
Ai : పరిపాలన వ్యవస్థలో పెను మార్పు
ఈ కార్యాచరణకు ప్రేరణగా జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళిక (NeGP) ఉంది. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో ఒక కొత్త తరహా ఏఐ (Artificial Intelligence ) నిపుణుల బృందాన్ని నిర్మించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఈ బృందంలో డైరెక్టర్లు, మధ్యస్థాయి స్థాయి అధికారులు ఉండబోతున్నారు. వీరికి AI పరిజ్ఞానంపై మెంటారింగ్ సెషన్లు, వర్క్‌షాపులు, రియల్ టైమ్ ప్రాజెక్ట్ అభివృద్ధి వంటి అవకాశాలు లభించనున్నాయి.
నేతిక విలువలు.. సమర్థత
ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో సాంకేతికతను సమర్థంగా వినియోగించడం, సామర్థ్యాన్ని పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించడం వంటి లక్ష్యాలు నెరవేరనున్నాయి. ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన, సమర్థమైన, ప్రభావవంతమైన పాలనను తీసుకురావడమే దీని ముఖ్యోద్దేశం.
పెరగనున్న పారదర్శకత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిజిటల్ టెక్నాలజీలను స్వీకరిస్తూ ముందడుగేస్తోంది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ AI (Artificial Intelligence) కార్యక్రమం కూడా అదే దిశలో పయనిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత పెరిగి, ప్రజల అవసరాలకు తగిన సమాధానాలు సాంకేతిక పరిజ్ఞానంతో త్వరగా అందించే అవకాశం ఉంది.
ఈ తరహా కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్న యువ అధికారులకు, సాంకేతిక నిపుణులకు కొత్త అవకాశాలు రానున్నాయి. ముఖ్యంగా AI విభాగంలో పనిచేయాలనుకునే ఉద్యోగార్థులకు ఇది మార్గదర్శకంగా నిలవొచ్చు. ప్రభుత్వ రంగంలో AI వినియోగం ఎలా ఉండాలో చూపించే మోడల్‌గా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందే అవకాశముంది.