Sarkar Live

సివిల్స్ 2026: ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం – Free Coaching

Free Coaching | సివిల్స్ ప‌రీక్ష‌ల కోసం సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. శిక్షణ కోసం ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్

Free Coaching

Free Coaching | సివిల్స్ ప‌రీక్ష‌ల కోసం సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. శిక్షణ కోసం ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రాష్ట్రంలోని ఎస్టి, ఎస్సి, బిసి అభ్యర్ధులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్ర‌త్యేక శిక్ష‌ణ (Free Coaching) ప్రారంభించ‌నుంది. ఈమేర‌కు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్సియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన రాష్ట్ర ఎస్టి. ఎస్సి., బిసి అభ్యర్ధుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్ధులు ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించొద్దు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా జూన్ 14 నుంచి జూలై 4 వరకు ఆన్ లైన్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉటుంది. . ఆన్ లైన్ అప్లికేషన్ కు సంబంధించిన సూచనలు http://studycircle.cgg.gov.in, http://twd.telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొంద‌వ‌చ్చు. మరిన్ని వివరాలకు ఫోన్ 6281766534 నంబర్ లో సంప్ర‌దించాల‌ని అధికారులు కోరారు.

Free Coaching కోసం అర్హతలు ఇవీ:

  • అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీలకు చెందినవారై ఉండాలి
  • ఆసక్తి ఉన్న వారు http://studycircle.cgg.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version