Sarkar Live

CUET- 2025 admit card | సీయూఈటీ పీజీ అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌

CUET- 2025 admit card : పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వ‌హించే CUET- 2025 పరీక్షల అడ్మిట్‌కార్డుల (admit card)ను జాతీయ పరీక్షా సంస్థ (The National Testing Agency (NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/cuet-pg/ నుంచి

CUET- 2025 admit card : పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వ‌హించే CUET- 2025 పరీక్షల అడ్మిట్‌కార్డుల (admit card)ను జాతీయ పరీక్షా సంస్థ (The National Testing Agency (NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/cuet-pg/ నుంచి అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CUET- 2025 పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.

CUET- 2025 admit card : డౌన్‌లోడ్ చేయడానికి ప్రొసెస్

CUET PG 2025 అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేయాలంటే, విద్యార్థులు ఈ కింది సూచనలను పాటించాలి:

  • అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/CUET-PG/ లేదా cuet.nta.nic.in ఓపెన్ చేయాలి.
  • Download Admit Card అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • అడ్మిట్‌కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అన్ని వివరాలను చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

CUET- 2025 admit cardలో ఎలాంటి వివరాలు ఉంటాయి?

అడ్మిట్‌కార్డులో విద్యార్థి పేరు, ఫొటో, సంతకం, అప్లికేషన్ నంబర్, పరీక్షా తేదీ, సమయం, పరీక్షా కేంద్రం అడ్రస్ ఉంటాయి. వీటిని స‌రిచూసుకున్నాకే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే NTA సహాయ కేంద్రాన్ని (ఫోన్ నంబర్: 011-40759000 లేదా ఈ-మెయిల్: helpdeskcuetpg@nta.ac.in) సంప్రదించాలి.

విద్యార్థులు పాటించాల్సిన నియమాలు

  • పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగా చేరుకోవాలి.
  • ఒరిజినల్ అడ్మిట్‌కార్డుతోపాటు గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ ఐడీ) తీసుకెళ్లాలి.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్, స్మార్ట్ వాచీలు, క్యాలికులేటర్లు) అనుమతించబడవు.
  • పరీక్ష సమయంలో నిబంధనల్ని తప్పక పాటించాలి.

CUET PG 2025.. మరిన్ని వివరాలు

  • పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • పరీక్షా కాలవ్యవధి: 2 గంటలు
  • ప్రశ్నల సంఖ్య: 100
  • మార్కింగ్ విధానం: సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి -1 నెగటివ్ మార్కింగ్
  • భాషా ఎంపికలు: పరీక్ష అనేక భాషల్లో అందుబాటులో ఉంటుంది

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version