Sarkar Live

Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?

Fahad Fazil Next Movie : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు హీరోలతో మాస్ డైలాగు లు చెప్పించి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు గడ్డు కాలం

Fahad Fazil

Fahad Fazil Next Movie : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు హీరోలతో మాస్ డైలాగు లు చెప్పించి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. పూరితో సినిమా అంటే స్టార్ హీరోలందరూ ఎదురుచూసేవారు. వరుసగా బ్లాక్బస్టర్లు కొడుతూ టాలీవుడ్ ని షేక్ చేసిన పూరీ తక్కువ రోజుల్లోనే సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

బిజినెస్ మాన్ మూవీని మహేష్ బాబు (mahesh babu) లాంటి స్టార్ హీరోతో 70 రోజుల్లో కంప్లీట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ డైరెక్టర్ మునుపటి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. బిజినెస్ మెన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli)పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని కోరాడంటే ఆ టైంలో పూరీ హవా అలా ఉండేది.

జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆది ఒక పూరీకే చెల్లింది. అలాంటి డైరెక్టర్ టెంపర్ మూవీ తర్వాత సరైన హిట్టు పడలేదు.చాలా కాలం తరవాత పూరి ఇస్మార్ట్ శంకర్ (ismart shankar)మూవీ తో మళ్లీ మునుపటి పూరిని బయటకి తీశాడని ఆడియన్స్ అనుకున్నారు.టచ్ లోకి వచ్చినట్టే అనిపించిన పూరీకి లైగర్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ మళ్ళీ ఫ్లాప్ లే తెచ్చిపెట్టాయి.అయినా పూరీకి మాత్రం హీరోలు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.

విజయ్ సేతుపతి ఫహద్ కాంబో..?

లేటెస్ట్ గా విజయ్ సేతుపతి(vijay sethupathi)తో బెగ్గర్ అనే మూవీ కూడా ప్లాన్ చేశారు.టబు (Tabu)లాంటి యాక్టర్ కూడా ఇందులో భాగం అయినట్టు కూడా తెలుస్తోంది.ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీలోని నటీ నటులను, సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.అయితే ఓ క్రేజీ న్యూస్ మాత్రం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్(fahadh fasial)కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.పూరీ స్టోరీ కూడా వినిపించారని ఫహద్ కి అది నచ్చిందట కూడా.

Fahad Fazil డేట్స్ అడ్జస్ట్ అయితే బాక్సాఫీస్ బద్దలే..

కానీ ఇప్పుడు ఉన్న బిజీ యాక్టర్స్ లో ఫహద్ ఫాసిల్ (Fahad Fazil) ఒకరు. తన డేట్స్ దొరకాలంటే చాలా కష్టం. ఆల్రెడీ చాలా ఏళ్లకు సరిపడ డేట్స్ లాక్ ఆగిపోయి ఉండొచ్చు. కానీ పూరీ మూవీ అంటే ఫహద్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది.అందులో విజయ్ సేతుపతి మూవీ కాబట్టి వదులుకోక పోవచ్చనే అనుకుంటున్నారు.ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ లో ఫహద్ చేరాడంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.ఈ క్రేజీ కాంబో లో వస్తున్న మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version