Sarkar Live

Game Changer Review : గేమ్ చెంజర్‌… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?

Game Changer Review : దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, కియారా అడ్వానీ, జయరాం,

Game Changer box office

Game Changer Review : దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, కియారా అడ్వానీ, జయరాం, శ్రీకాంత్, ఎస్,జే సూర్య ప్రధాన పాత్రలుగా ఈ మూవీ రూపొందింది. మరి ఈ సినిమాలో శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందో ఇ్పుడు చూద్దాం…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వర‌కు రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే నడిచింది. పెద్దగా కొత్తదనం ఏమీ క‌నిపించ‌లేదు. మూవీ నడిచిన విధానం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేష‌న్‌కు స‌రిగా రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే రా మచ్చ, డోప్ సాంగ్స్ ని శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ స్టోరీకి తగ్గట్టుగా, సిట్చువేషన్ కి తగ్గట్టుగా రాలేదు. శంకర్ టేకింగ్ ఫస్ట్ ఆఫ్ లో తేలిపోయిందని చెప్పొచ్చు.

రామ్ చరణ్ , కియరా అడ్వానీ మధ్య లవ్ ట్రాక్ కూడా గాడి తప్పింది. వారి మధ్య వచ్చే సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. కామెడీ పరంగా చూస్తే బ్రహ్మానందం సునీల్ ను డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకోలేదని అనిపించింది. కానీ ఇంటర్వెల్ మాత్రం ఊహించని విధంగా ప్రేక్షకుడు థ్రిల్ కు గురయ్యే విధంగా ఉందని చెప్పొచ్చు. ఇంటర్వెల్ సన్నివేశమే సెకండాఫ్ కోసం ప్రేక్షకుడు ఎదురుచూసేలా చేసింది.

ఇక‌ సెకండాఫ్ లో రామ్ చరణ్ అప్పన్న పాత్రలో ఒదిగిపోయారని చెప్పచ్చు. ఆ పాత్రలో చూపించిన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. రంగస్థలంలో సినిమాలో చిట్టిబాబు పాత్రలో యాక్టింగ్ పరంగా ఎంత వైవిధ్యం చూపించాడో ఈ సినిమాలో అప్పన్నపాత్రతో అంతకుమించి యాక్టింగ్ చేసి ఆ పాత్రకు ప్రాణం పోశాడు. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ టేకింగ్ వింటేజ్ శంకర్ ని గుర్తుకు తెస్తుంది.

కథను మాత్రం ఎక్కడ పట్టు విడవకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. తనదైన మార్క్ విజువల్స్‌తో తనెంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. కానీ ఎమోషన్స్ ని సరిగ్గా డీల్ చేయలేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ గా చెప్పొచ్చు.

Game Changer Telugu Review : అంజలి కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది. ఎస్ జె సూర్య తనదైన ఫన్ డైలాగ్ మోడ్యులేషన్ తో మరొకసారి నటుడుగా నిరూపించుకున్నారు. ఇక శ్రీకాంత్, జయరాం కూడా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా నటించారు. తమన్ బిజిఎం సో సో గానే ఉందని చెప్పచ్చు. సీన్స్ కి తగ్గట్టుగా తన రేంజ్ లో ఇవ్వలేదనిపించింది. పాటలు అదిరిపోయేలా ఉన్నా ఎంతో హిట్టైనా నాన హైరానా సాంగ్ ఇందులో లేకపోవడం పెద్ద మైనస్.

కార్తీక్ సుబ్బరాజు కథ, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ అఫ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదనిపించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version