Sarkar Live

Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు

Hydra Police Station : హైదరాబాద్‌ ‌నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ.. నీటి వనరులను పరిరక్షిస్తూ హైస్పీడ్ తో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ

Hydra

Hydra Police Station : హైదరాబాద్‌ ‌నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ.. నీటి వనరులను పరిరక్షిస్తూ హైస్పీడ్ తో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా (Hydra) ప్రత్యేక విభాగానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే, హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లలోనే కేసులు నమోదవుతాయి. ఇప్పటివరకు సాధారణ పోలీస్‌ ‌స్టేషన్లలో నమోదైన భూకబ్జా కేసులపై హైడ్రా దాడులు జరుపుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ కేసులు సాధారణ స్టేషన్ల నుంచి హైడ్రా స్టేషన్లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అనేది చెరువులు, ఉద్యానవనాలు, ప్రభుత్వ భూములు వంటి ప్రజా ఆస్తులను రక్షించడానికి సృష్టించబడిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్. ఇది ఇప్పటికే హైదరాబాద్‌లో అనధికార నిర్మాణాలను కూల్చివేసి, భూ కబ్జాదారులపై చర్య తీసుకోవడం ద్వారా తన తడాఖాను చూపించింది. దీని విజయాన్ని చూసిన ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని అధికారాలను ఇచ్చింది. దీనిని ఇతర జిల్లాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇక నుంచి, ప్రభుత్వ ఆస్తుల అక్రమ ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదులను స్థానికులు లేదా అధికారులు నేరుగా HYDRAA పోలీస్ స్టేషన్లలో దాఖలు చేయవచ్చు. సాధారణ పోలీస్ స్టేషన్లలో నమోదైన భూ ఆక్రమణ కేసులు ఇప్పుడు HYDRAAకి బదిలీ చేయబడతాయి, దీని వలన దర్యాప్తు వేగంగా, మరింత కేంద్రీకృతమై ఉంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version