Indian Railways : భారతీయ రైల్వే సరికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల తయారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది.
Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల తయారీకి ప్రాధాన్యం
ఈసారి ప్రత్యేకంగా నాన్ ఏసీ కోచ్‌ల (non AC coaches) ఉత్పత్తికి భారతీయ రైల్వే ప్రాధాన్యమిచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4,601 సాధారణ కోచ్‌ల (coaches)ను తయారు చేశారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 3,300 కోచ్‌ల ఉత్పత్తి (Coach production) మాత్రమే జరగ్గా 2014-2024 మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత దశాబ్దంలో 54,809 కోచ్‌లను ఉత్పత్తి చేయగా ప్రతి ఏడాదికి సగటున 5,481 కోచ్‌ల ఉత్పత్తి జరిగింది.
చెన్నై ICF ఫ్యాక్టరీ రికార్డు
భారతదేశంలో ప్రధానంగా మూడు రైల్వే కోచ్ తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), పంజాబ్‌లోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF), ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (MCF) వంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని ICF ఫ్యాక్టరీ (Integral Coach Factory) 2024-25లో 3,007 కోచ్‌లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Indian Railways : అధునాతన ప్రమాణాలు
రైల్వే కోచ్‌ల ఉత్పత్తిలో భారీ పెరుగుదల కారణంగా దేశీయంగా తక్కువ వ్యయంతో అధిక సంఖ్యలో రైళ్లను అందుబాటులోకి తేవచ్చని కేంద్రం భావిస్తోంది. భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతికతను అవలంబిస్తూ విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటోంది. కొత్త కోచ్‌లలో అధునాతన భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, ఇంకా పెద్ద సామర్థ్యంతో కూడిన రైళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..