Instagram parental controls : ఇన్‌స్టాగ్రామ్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విరివిగా వాడుతున్నారు. రీల్స్ చూస్తూ, స్టేటస్ పెట్టుతూ, తమ జీవితంలోని ప్రతి సంఘటననూ ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ, ఈ డిజిటల్ ప్రపంచం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే పిల్లలు అసభ్య కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తుండటంతో వారి భవిష్యత్తు పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం కొత్త నియమాలను (Instagram safety rules for under 16) ప్రవేశపెట్టింది. ఇకపై ఆ వయసులోపు వారికి ఇన్‌స్టాలో లైవ్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి (Parental permission required for Instagram Live) చేశారు. ఇది ఒక్క లైవ్ స్ట్రీమింగ్ విషయంలో మాత్రమే కాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఫొటోలు, అసభ్య కంటెంట్ కనిపించకుండా తల్లిదండ్రుల పర్మిషన్ ఆధారంగా నియంత్రణలు పెట్టారు.
పేరింట్స్ అనుమతి తప్పనిసరి
మెటా సంస్థ తమ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ యాక్సెస్ ఇప్పించాలంటే వారి పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. లైవ్ సదుపాయం యాక్టివేట్ చేయాలంటే పేరెంట్స్ ఓకే చెబితేనే ఆ అవకాశం కలుగుతుంది. అంతేకాదు.. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడ్ ఇమేజెస్ వస్తే అవి ఆటోమేటిక్‌గా బ్లర్ అవుతాయి. వాటిని చూసే అవకాశం లేకుండా ఫిల్టర్ పనిచేస్తుంది.
Instagram parental controls : మెటా మొత్తం ఇవే నియమాలు
ఈ నియమాలు (Meta updates child protection policies) కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం కావు. ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకూ ఈ భద్రతా మార్పులు వర్తిస్తాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చిన్నారుల మనసును ఎలా ప్రభావితం చేస్తున్నాయనే దానిపై మెటా పరిశీలన చేస్తోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రుల కోసం మరిన్ని నియంత్రణ ఎంపికలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
టీనేజర్లకు Instagram కొన్ని రక్షణ చర్యలు
సెప్టెంబరులో మెటా సంస్థ టీనేజ్ అకౌంట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది తల్లిదండ్రులకు వారి పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలను పర్యవేక్షించేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కొత్తగా జాయిన్ అయ్యే పిల్లల ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా ఉంచడం, అపరిచితుల నుంచి మెసేజ్‌లు బ్లాక్ చేయడం వంటి విధానాలు ఉన్నాయి.
అలర్ట్ చేసే ఫీచర్లు
ఇంకా టీనేజర్లు Fight Videos లాంటి హింసాత్మక కంటెంట్‌ను చూడకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా 60 నిమిషాల పాటు యాప్ వాడిన తర్వాత యూజర్లకు ‘విరామం తీసుకోండి’ అంటూ అలర్ట్స్ వస్తాయి. రాత్రివేళల్లో నోటిఫికేషన్లను నిలిపివేయడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి మార్పులు అనుచితమైన కంటెంట్ నుంచి టీనేజర్లను రక్షించడంలో ఉపయోగపడతాయని (Teen safety features on social media) నిపుణులు భావిస్తున్నారు. పిల్లల ప్రైవసీకి గౌరవం ఇవ్వడమే కాకుండా వారికి భద్రతనూ కల్పించడమే మెటా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ దేశాలూ ఈ మార్పులను సానుకూలంగా స్వీకరిస్తున్నాయి.
సమాజానికి ఉపయోగపడేలా నిర్ణయాలు
ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న ఈ నిర్ణయాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. చిన్న వయసులో పిల్లలు అసభ్య కంటెంట్‌కి బానిసలు కాకుండా వారి మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడే విధంగా ఈ మార్పులు (Digital safety tips for kids online) పనిచేస్తాయి. పిల్లలు స్వేచ్ఛగా అభివృద్ధి చెందాలన్నా భద్రతా పరంగా కొంత నియంత్రణ అవసరం. ఇన్‌స్టాగ్రామ్ మార్పులు అదే దిశగా సూచిస్తున్నాయి.
తల్లిదండ్రులకు నిపుణుల సూచనలు
తల్లిదండ్రులు కూడా ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకోవాలని అంటున్నారు మానసిక నిపుణులు. తమ పిల్లల డిజిటల్ ప్రపంచాన్ని పర్యవేక్షించేందుకు ముందుకు రావాలని అంటున్నారు. మొబైల్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. వారి ఆన్‌లైన్ అలవాట్లను తెలుసుకుని అవసరమైన మార్గదర్శనం ఇవ్వాలని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.