Sarkar Live

Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?

Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్

Nagarjuna

Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar)డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఆ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రజినీకాంత్ మరో సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ (kooli)మూవీని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున(nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర (upendra)యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున నుండి సోలోగా మూవీ వచ్చి చాన్నాళ్లే అయిపోయింది. ఆఖరిగా తన నుండి నా స్వామి రంగ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇంపార్టెంట్ క్యారెక్టర్లకు గ్రీన్ సిగ్నల్…

కానీ వేరే హీరోలు చేస్తున్న మూవీల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లు చేయడానికి ఓకే చెప్తున్నాడు.ఆల్రెడీ కూలీ మూవీలో చేస్తుండగా నాగ్ లుక్కుకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతోపాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర(kubera)మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నారు.

Nagarjuna సోలో హీరోగా మూవీ ఎప్పుడు..?

ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న జైలర్ -2 మూవీలో కూడా నాగార్జున నటిస్తున్నట్లు ఫిలింనగర్ సర్కిల్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఇదే నిజమైతే రజనీకాంత్ తో వరుసగా తనకి రెండో సినిమా. ఈ మూవీలో బాలయ్య కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో ఎంతవరకు నిజం ఉందో మూవీ టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు నాగ్ నటిస్తున్న వార్తలపై కూడా మూవీ టీమ్ స్పందించలేదు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని తెలుస్తోంది. దీనిపై నాగ్ అభిమానులు మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు. వరుసగా సైడ్ క్యారెక్టర్లను చేస్తున్న నాగ్ సోలో హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఆ క్యారెక్టర్లు చేసుకుంటూనే తొందరగా హీరోగా కూడా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. దీని పై నాగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version