Karthi New Movie : మొదటి నుండి హీరో కార్తీ (Karthi)తన మూవీస్ ని డిఫరెంట్ స్టైల్ లో తీస్తుంటాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన మూవీస్ కి సే మ్ క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ మూవీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. రొటీన్ రొడ్డ కొట్టుడు మూవీస్ కాకుండా ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటాడు.
ఖాకీ, ఖైదీ,సర్దార్, సత్యం సుందరం మూవీసే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.ఈ మూవీస్ ఫ్యాన్స్ ని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సర్దార్ (sardar) సీక్వెల్ కూడా మొదలుపెట్టిన కార్తీ…లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)తో ఖైదీ సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajnikanth)తో కూలి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దశలో ఈ మూవీ ఉంది.
ఇది అయ్యాక ఖైదీ-2 పనులు మొదలుపెట్టపోతున్నారట. ఇంతలో కార్తీ కూడా తను చేస్తున్న మూవీస్ ని కంప్లీట్ చేస్తాడు. లేటెస్ట్ గా తన 29వ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. డ్రీమ్ వారియర్స్ ఎంటర్టైన్మెంట్స్ పిక్చర్స్ పై (dream warriors entertainment pictures) ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఒక పోస్టర్ ని వదిలారు. ఇది రియలిస్టిక్ అంశాలతో కూడుకున్న కథగా తెలుస్తోంది.
Karthi New Movie .. సముద్రం నేపథ్యంలో..
ఒకప్పుడు రామేశ్వరం శ్రీలంక మధ్య మార్గంలో సముద్రపు దొంగలు ఉండేవారు. ఆ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సముద్రపు బ్యాక్ డ్రాప్ లోనే మూవీ ఉండబోతునట్టు తెలుస్తోంది. ఈ మూవీని తమిజ్ (thamiz) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో వడివేలు..?
సీనియర్ కమెడియన్ వడివేలు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని చేస్తున్నట్లు టాక్ వినబడుతుంది
అలాగే హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శిని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇంతకు ముందు కార్తీ తీసిన మూవీల కంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని కోలీవుడ్ టాక్. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ అయిపొయొచ్చయని తెలుస్తోంది. ఆగస్టు లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీలో నటించే నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మూవీ టీమ్ వెల్లడించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..