Sarkar Live

“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..

ఓటీటీలో పోటీపడనున్న రెండు సినిమాలు నవంబర్ 28 న ఒకే రోజు ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ “క”, మలయాళ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్న దుల్కర్ సల్మాన్

Lucky Bhaskar
  • ఓటీటీలో పోటీపడనున్న రెండు సినిమాలు
  • నవంబర్ 28 న ఒకే రోజు ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ “క”, మలయాళ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా నటించిన సినిమా లక్కీ భాస్కర్(Lucky Bhaskar). ఈ రెండు సినిమాలు దీపావళి సందర్భంగా విడుదలై దేనికవే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లు ఇప్పటికే స్పష్టం అవుతోంది. దీపావళి కానుకగా రిలీజైన “KA” సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్ నటించిన “లక్కీ భాస్కర్” విడుదలై ఆ హీరో కెరీర్ లొనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించడం విశేషం.హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా “క” సినిమాను సుజీత్, సందీప్ తెరకెక్కించగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన” లక్కీ భాస్కర్” సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

అసలు విషయం ఏమిటంటే దీపావళి సందర్భంగా ఈ రెండు సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని అత్యధిక వసూళ్లు సాధించినప్పటికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి రాబోతుండడంతో సోషల్ మీడియాలో ఏ సినిమాను ఎక్కువ ఆదరిస్తారు, ఏ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టించబోతుంది అనే చర్చ జరుగుతోంది.”లక్కీ భాస్కర్ “మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా, కిరణ్ అబ్బవరం మూవీ “క”ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవనున్నట్లు తెలుస్తోంది.ఈ రెండు సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ఓటీటీలో మాత్రం తీవ్ర పోటీ తప్పదని ప్రచారం జరుగుతోంది . నవంబర్ 28 న ఓటీటీలో విడుదలవుతున్న రెండు సినిమాలు “క”V/S “లక్కీ భాస్కర్” లలో ఏ సినిమా ముందంజలో ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం గమనార్హం.


 

Facebook Twitter LinkedIn WhatsApp

One thought on ““క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version