Sarkar Live

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు.

Ravi Teja

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు.

కొత్త డైరెక్టర్ చేతిలో Ravi Teja 75వ మూవీ..

ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవీ తర్వాత రవితేజతో శ్రీ లీలకు ఇది రెండో సినిమా.

క్లాస్ డైరెక్టర్ తో..

ఇదిలా ఉండగా మాస్ మహారాజా రవితేజ (Ravi Teja 76th Movie ) 76 వ మూవీని ఒక క్లాస్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. నేను లోకల్, చిత్రలహరి లాంటి క్లాస్ హిట్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల (kishore thirumala)డైరెక్షన్లో ఒక మూవీ రాబోతుందని తెలుస్తోంది. మాస్ జాతర మూవీ తర్వాత ఈ మూవీ పట్టాలకు ఎక్కే ఛాన్స్ ఉందట. ఈ మూవీని చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దసరా,ది పారడైజ్ మూవీలను నిర్మించిన చెరుకురి సుధాకర్ రవితేజతో సినిమా చేస్తుండడంతో ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

లేటెస్ట్ గా ఈ మూవీ మొదలుకాకముందే ఫిలింనగర్ నుండి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. కిషోర్ తిరుమల రవితేజ కాంబోలో రాబోతున్న మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను తెర కెక్కించడం కంటే కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేయడమే ముఖ్యం. కరెక్ట్ స్లాట్ లో మూవీ రిలీజ్ అయితే దానికి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చాలా సినిమాలు నిరూపించాయి. గత సంక్రాంతికి రిలీజ్ అయిన వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అనుకున్న ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయడంతో వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. కానీ వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ చిరు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో మూవీ కూడా అప్పుడే రాబోతుంది. కిషోర్ తిరుమల రవితేజ కాంబో అంటే ఎంతైనా క్లాస్ రేంజ్ లోనే ఉంటుంది.ఏదేమైనా వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ పై ఆడియన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. కానీ వీరి కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version