Megastar Chiranjeevi New Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబినేషన్లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విక్టరీ వెంకటేష్ క్లాప్, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దిల్ రాజు, రాఘవేంద్రరావు హాజరయ్యారు.
ఇక ఈ మూవీకి చిరునవ్వుల పండుగ (Chirunvvula panduga) అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ నుండి తెగ రెస్పాన్స్ వస్తుంది.లేటెస్ట్ గా మూవీకి సంబంధించిన టీం ని చిరు పరిచయం చేసే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోకి అనూహ్య స్పందన వస్తోంది.
చిరు (Megastar Chiranjeevi) ఓల్డ్ మూవీస్ చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఇంద్ర,శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలోని చిరు పోస్టర్లను పోస్టర్లని చూపెడుతూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్ , కో రైటర్ కం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్,ప్రొడక్షన్ డిజైనర్ , డిఓపి, ఎడిటర్,మ్యూజిక్ డైరెక్టర్ ,ప్రొడ్యూసర్స్ ని పరిచయం చేస్తూ సరికొత్తగా చేసిన ఈ వీడియో ఫాన్స్ ని అలరిస్తోంది. ఇక ఆఖరిలో అనిల్ రావిపూడి పరిచయం చేసుకుంటుండగా తెలుసులెవయ్యా..ఈ గ్యాంగ్ మొత్తానికి నువ్వే లీడర్ వి అని ఈ సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నావ్ అని చిరు అనడం.. దానికి అనిల్ వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ ని రఫ్ఫాడిచేద్దాం సార్ అంటాడు. దీంతో చిరు.. అంతొద్దు అని తన హిట్లర్ సినిమాలోని డైలాగ్ కొడ్తాడు. అనిల్ రావిపూడి కాస్త తగ్గి మెల్లిగా రఫ్పాడించేద్దాం సార్ అంటాడు. దానికి చిరు ఇది చాలు అని అంటాను అనుకున్నావు కదా సరిపోదు ఇంకా పెద్దగా చెప్పు అని చిరు చెప్పడంలో మూవీ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో తెలుస్తోంది.
అనిల్ క్రేజీ ప్రమోషన్స్..
అనిల్ రావిపూడి మూవీ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో సంక్రాంతికి వస్తున్నా మూవీ తో మనం చూసాం. తను చేసిన వీడియోలు ఆడియన్స్ లో మూవీ చూడాలనే ఆసక్తి కలిగిస్తాయి. హీరో వెంకటేష్(victory venkatesh), హీరోయిన్ లతో డైరెక్టర్ అనిల్ రావిపూడి అందరూ కూడా రీల్స్ లాంటి వాటితో ఎంటర్టైన్ చేసి మూవీ హిట్ అవడంలో భాగమయ్యారు. ఇక ఈ మూవీ ని కూడా అదే రీతిలో ప్రారంభించారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలెట్టి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.బాస్ ని పూర్తి ఎంటర్టైనర్ గా వింటేజ్ చిరుని చూపిస్తారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..
ఇంకా ఫైనలైజ్ కాని హిరోయిన్…
ఈ మూవీలో పలువురు హీరోయిన్ల పేర్లు వినబడుతున్నాయి. భూమిక (Bhumika), అదితి రావు హైదరి(Aditi Rao hydari), పరిణితి చోప్రా ఇలా అందాల భామల పేర్లు వినబడుతున్నా.. ఇంకా మూవీ టీం హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదు. జూన్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో హీరోయిన్ ని ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని చిరు తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..