Sarkar Live

Megastar Chiranjeevi | చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు.. ప్ర‌క‌టించిన యూకే

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు ఆయ‌న చేస్తున్న సేవలకు, వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా యూకే ప్రభుత్వం (UK Government) ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం

Vishvambhara

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు ఆయ‌న చేస్తున్న సేవలకు, వ్య‌క్తిగ‌తంగా చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా యూకే ప్రభుత్వం (UK Government) ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం (Lifetime Achievement Award)తో స‌త్క‌రించ‌నుంది. ఈనెల 19న యూకే పార్ల‌మెంట్‌లోని హౌస్ ఆఫ్ కామ‌న్స్ (House of Commons)లో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా, సోజ‌న్ జోస‌ఫ్‌, బాబ్ బ్లాక్‌మ‌న్ స‌హా ప‌లువురు పార్ల‌మెంట్ స‌భ్యులు చిరంజీవిని ఈ మేర‌కు స‌త్క‌రించనున్నారు.

Megastar Chiranjeevi : అంత‌ర్జాతీయ వేదిక‌పై అరుదైన గౌర‌వం

బ్రిడ్జ్ ఇండియా అనే UKలోని ప్రముఖ సంస్థ చిరంజీవికి ఈ అవార్డును ప్ర‌క‌టించింది. “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్‌షిప్” అనే ప్రతిష్టాత్మక పురస్కారంతో ఆయ‌న్ను స‌త్క‌రించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. అంతర్జాతీయ వేదికపై, ముఖ్యంగా UK వంటి దేశంలో చిరంజీవి ఈ అరుదైన అవార్డును అందుకోనుండంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

మెగాస్టార్‌కు వ‌రుస పుర‌స్కారాలు

భారతదేశ అత్యున్నత పద్మ విభూషణ్ పుర‌స్కారాన్ని చిరంజీవి ఇటీవ‌లే అందుకున్నారు. ఈ అరుదైన‌ గౌరవాన్ని 2024లో భారత ప్రభుత్వం ఆయనకు ప్ర‌దానం చేసింది. అలాగే ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో “మోస్ట్ ప్రోలిఫిక్ యాక్టర్/డ్యాన్సర్” అనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ANR శతాబ్ది ఉత్సవాల్లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన ANR నేషనల్ అవార్డును ప్రదానం చేశారు. తాజాగా యూకే ప్ర‌భుత్వం ఆయ‌న్ను జీవిత సాఫ‌ల్య పురస్కారాన్ని అందించ‌నుంది. దీంతో ఆయ‌న అభిమానుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మవుతోంది.

Megastar Chiranjeevi : సామాజిక దృక్ప‌థం

చిరంజీవి సినీ రంగంలో తన స్థాయిని పదిలం చేసుకోవడమే కాకుండా సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేశారు. రక్తదానం, ఆరోగ్యసేవలు, పేద విద్యార్థులకు సహాయం, సహజ విపత్తుల సమయంలో సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ లక్షలాది మందికి ప్రాణాధారంగా నిలిచింది. ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల ఆయనకు అంతర్జాతీయ వేదికల్లో గౌరవం దక్కుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version