Sarkar Live

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి

Miss World 2025

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version