Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అందజేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. శ్రీలంక (Sri Lanka) పర్యటనలో మోదీ ఉండగా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్యక్రమం ఇవాళ జరిగింది.
Mithra Vibhushana Award : అత్యున్నత పౌర పురస్కారం
మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరించే అత్యున్నత స్థాయి పౌర పురస్కారం. ఈ అవార్డును అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ స్థాయి నాయకులకు మాత్రమే ప్రదానం చేస్తుంటారు. ఈ అరుదైన గౌరవం ఈసారి ప్రధాని మోదీకి దక్కింది. గతంలో ఈ అవార్డును పొందిన ప్రముఖుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయ్యూం, పాలస్తినా మాజీ అధ్యక్షుడు యాసిర్ అరాఫత్‌కు ప్రదానం చేశారు. అవార్డు స్వీకరించే సమయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ “శ్రీలంక అధ్యక్షుడు దిసానాయికె చేత మిత్ర విభూషణ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, భారత్‌లోని 1.4 బిలియన్ల ప్రజలందరికీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు.
బలపడుతున్న భారత్-శ్రీలంక సంబంధాలు
ప్రధాని మోదీ హయాంలో భారత్-శ్రీలంక సంబంధాలు మరింత బలపడ్డాయి. అనేక రంగాల్లో సహకారం పెరిగింది. భారత రుణాలు, గ్యారెంటీల ద్వారా శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ మద్దతు ఇచ్చింది. రోడ్లు, రైల్వేలు, హాస్పిటళ్లు నిర్మాణానికి సాయం చేసింది. బౌద్ధ ధర్మం, సాంస్కృతిక వారసత్వాన్ని భారత్ తరచూ ప్రస్తావించడమే కాకుండా ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతోంది. ప్రాంతీయ సమాఖ్యలను బలపరుస్తోంది. BIMSTEC వంటి సమాఖ్యలలో కలిసి పనిచేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.