Sarkar Live

Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!

Anganwadi Centers | అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పిల్లలకు మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో

Anganwadi Centers

Anganwadi Centers | అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పిల్లలకు మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశామని వివరించారు. వారి నివేదిక ఆధారంగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పల్లీ పట్టీలు, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

పైలట్ ప్రాజెక్టు కింద ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్వాడీ (Anganwadi Vehicles) వాహనాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ గుడ్లు, ఆహారం చేస్తున్నామని తెలిపారు. టేక్ హోమ్ రేషన్ ఇవ్వడమే కాకుండా.. ఆ ఇండ్లను అంగన్వాడీ సిబ్బంది సందర్శించి సరఫరా చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా పరిశీలించి అవగాహన పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

కిశోర బాలికలతో స్వయం సహాయక బృందాల(SHG)ను ఏర్పాటు చేస్తున్నాం. వారికి కూడా పౌష్టికాహారంపై అవగాహన పెంచాలి. మహిళల్లో ఎనిమియాను ఐదు శాతం తగ్గించేల చర్యలు చేపట్టాలి. ప్రతి మండలంలో కనీసం 3 అంగన్వాడీ భవనాలను నిర్మించే పనులను ప్రారంభించాలని సూచించారు.

చివరి నిమిషంలో ప్లాన్స్ వేసుకోవడం వల్ల బడ్జెట్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం
అందుకే ఎప్పటికప్పుడు బడ్జెట్ ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకోసారి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాము. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసే దిశలో పనిచేయాలి. ఆరేళ్ల లోపు చిన్నారులంతా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలి. ఈ ఏడాది లో అంగన్వాడిల్లో హాజరు శాతం పెరగాలి. హాజరు మరో 30 శాతం పెంచే టార్గెట్ రీచ్ కావాలి.

తద్వారా చిన్నారుల్లో పోషకార లోపాన్ని నివారించవచ్చు. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయండి
దత్తత ఇచ్చే లోపు, పిల్లల సంరక్షణ బాధ్యత కు స్వీకరించేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి. ఆ చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే వారికి ఆర్థిక చేయుత నిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేయిస్తుంది. అనుగుణంగా దివ్యాంగులను గుర్తించి అధికారులు సర్జరీ ఏర్పాట్లు చేయాలి. రాజీవ్ యువ వికాస పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తున్నాం. దివ్యాంగు లు అంతా వినియోగించాలి. కుటుంబంలో దివ్యాంగులుంటే..వారి పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది అని మంత్రి సీతక్క వెల్లడించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version