Rajnikanth Coolie Movie | చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ స్క్రీన్ పై బడా స్టార్స్ మధ్య పోటీని ఆడియన్స్ చూడబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (super star Rajnikanth) యాక్ట్ చేసిన కూలీ (Coolie) మూవీ పై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ మూవీలోని రజిని స్టైల్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఆ మధ్య ఒక సాంగ్ రిలీజ్ చేయగా రజిని స్టెప్స్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. అనిరుద్ (Anirudh)మ్యూజిక్ కి రజిని స్టెప్స్ అందులో తన స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రోజురోజుకు ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఉన్న రజిని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ చేస్తూనే వారిని ఖుషీ చేస్తున్నారు.
మూవీ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు చెప్పారు.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,హృతిక్ రోషన్ (young tiger NTR, hrithik roshan) కాంబోలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న వార్ 2 (war-2)మూవీ కూడా అదే రోజున వస్తుందని స్టార్టింగ్ లోనే ప్రకటించారు. అనుకున్నట్టుగా జరిగితే ఈ రెండు మూవీస్ ఒకే రోజున రిలీజ్ అవ్వనున్నాయి.
రికార్డ్ ల వేటలో రెండు సినిమాలు..
వార్ -2 మూవీపై కూడా ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పై యాక్షన్ యూనివర్స్ లో వార్, టైగర్ పఠాన్ లాంటి మూవీస్ వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు అందులోనే వార్ -2 తెరకెక్కింది. హృతిక్ రోషన్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీతో ఈ మూవీ ని కంపేర్ చేస్తే ఆడియన్స్ కూలి మూవీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినబడుతుంది. సూపర్ స్టార్ స్టామినా ఎలా ఉంటుందో మనకు తెలుసు. అతని నుండి మూవీ వస్తుందంటే ఎంత పెద్ద హీరో అయినా కానీ మూవీని వాయిదా వేయడమో , ముందుకు జరపడం చేస్తూ ఉంటాడు. అలా వార్ -2 వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Rajnikanth Movie : ఢీ కొడుతుందా..ఆగుతుందా.?
కూలి మూవీలో సౌత్ కి చెందిన చాలామంది బడా స్టార్లు యాక్ట్ చేశారు. అంతకుమించి ఈ మూవీ కి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో రికార్డుల సునామి ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి రజిని మేనియాను ఢీ కొట్టడానికి వార్ -2 రెడీ అవుతుందా..లేదా ఆగి వస్తుందా చూడాలి. ఏదేమైనా కూడా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రానునుండంతో సినీ అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.