Sarkar Live

Peddi First Look | అదిరిపోయేలా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ లుక్..

Peddi First Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan Tej) మొదటి మూవీ చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ మూవీలో పూరీ జగన్నాథ్ తనదైన ఎలివేషన్ లతో, డైలాగ్

Peddi First Look

Peddi First Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan Tej) మొదటి మూవీ చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ మూవీలో పూరీ జగన్నాథ్ తనదైన ఎలివేషన్ లతో, డైలాగ్ లతో రామ్ చరణ్ తేజ్ ని ప్రజెంట్ చేయగా చరణ్ డ్యాన్స్ లతో రఫ్ఫాడించాడు.ఇక రెండో మూవీతోనే ఇండస్ట్రీ రికార్డు లను తిరుగరాసాడు. ఒక్కొక్క మూవీ తో తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోయిన చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.

ఇక రామ్ చరణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchibabu) తెరకెక్కిస్తున్నారు.స్పోర్ట్స్ డ్రామా గా వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్ గా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi :పెద్ది టైటిల్ ఖరారు…

మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ లో ఊహించని రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా చరణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని, చరణ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది మూవీ టీమ్. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న పెద్ది (Peddhi) టైటిల్ నే ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తేజ్ లుక్ చూస్తే గూస్ బమ్స్ వస్తున్నాయి. రగ్ డ్ లుక్ (Peddi First Look) లో నోట్లో బీడీ పెట్టుకుని ఆడియన్స్ ఊహించని విధంగా ఊర మాస్ కేరక్టర్ లో కనిపిస్తున్నారు.

Peddi First Look : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో…

లుక్ చూసిన ఫ్యాన్స్ ఈ మూవీ చరణ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్టుగా నిలిచిపోతుందని అనుకుంటున్నారు. ఇలాంటి మాస్ లుక్ లో చరణ్ తన పర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ని మెస్మరైస్ చేస్తారని, ఆర్టిస్టుగా తన ని మరో మెట్టు ఎక్కించే మూవీ అవుతుందనడం లో సందేహం లేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా తెలుస్తోంది.

స్పోర్ట్స్ డ్రామా కాబట్టి లుక్, (Peddi First Look) టైటిల్ చూశాక ఇంకా ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వచ్చిన మొదటి మూవీ ఉప్పెన భారీ హిట్టు తర్వాత చాలా కాలం వెయిట్ చేసి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ (Janvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు,శివరాజ్ కుమార్ , దివ్యేందు తదితరులు నటిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ , ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version