Sarkar Live

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు.

GHMC

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ కె. ఇలంబర్తి నుంచి ఆర్వి కర్ణన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్.వి. కర్ణన్, హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి ఆహార సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆహార భద్రతపై ప్రజలలో అవగాహన పెంచారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా కొనసాగిన కె.ఇలంబర్తి జిహెచ్ఎంసి కమిషనర్‌గా తన పదవీకాలంలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పౌర సేవల మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో ఎంఏయు డి కార్యదర్శిగా బదిలీ అయ్యారు. కాగా ఈ సందర్భంగా, నూతన కమిషనర్ కు అదే విధంగా బదిలీ పై వెళుతున్న ఇలంబర్తికి జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, కర్ణన్ బదిలీ తర్వాత, ఐఏఎస్ అధికారిణి ఎస్.సంగీత సత్యనారాయణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త నాయకత్వంలో హైదరాబాద్ రెస్టారెంట్లపై దూకుడుగా తనిఖీ డ్రైవ్ కొనసాగుతుందో లేదో చూడాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version