Sarkar Live

Kuberaa | అదరగొడుతున్న కుబేర టీజర్ చూశారా..?

Shekar kammula Kuberaa Movie | లవ్ స్టోరీస్ ని డిఫరెంట్ గా తెరకెక్కించే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(Shekar kammula) ముందుంటారు. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా మ్యూజికల్ హిట్టుగా కూడా నిలిచింది. హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,

Shekar kammula Kuberaa Movie

Shekar kammula Kuberaa Movie | లవ్ స్టోరీస్ ని డిఫరెంట్ గా తెరకెక్కించే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(Shekar kammula) ముందుంటారు. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా మ్యూజికల్ హిట్టుగా కూడా నిలిచింది. హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా,లవ్ స్టోరీ మూవీస్ తో టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

లవ్ స్టోరీ (Love story)మూవీ తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కుబేర(kuberaa)మూవీని తెరకెక్కించాడు. ఎప్పుడు కూడా స్టార్ క్యాస్టింగ్ తో సినిమా తీయని శేఖర్ కమ్ముల ఈసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో(Dhanush)డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీ భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.ఇక ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేలా ఉంది.

సాంగ్ తో Kuberaa టీజర్…

అన్ని సినిమాల టీజర్ ల కాకుండా శేఖర్ కమ్ముల డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. ఒక సాంగ్ తో ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశారు. టీజర్ చూస్తుంటే ఇది ఒక రివేంజ్ డ్రామాల అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కింగ్ నాగార్జున (king nagarjuna)యాక్ట్ చేస్తుండగా ధనుష్ బిచ్చగాడు పాత్రలో ఆకట్టుకుంటున్నారు.

సార్ మూవీ తర్వాత ధనుష్ తెలుగులో ఈ మూవీ ని ఓకే చేశాడు. ఏదో విషయం ఉంటే తప్ప ధనుష్ ఈ మూవీని ఓకే చేయడన్న విషయం మనకు తెలిసిందే. శేఖర్ కమ్ముల కూడా పర్ఫెక్ట్ స్టోరీ సెట్ కానిదే తెరపైకి తీసుకురాడు అన్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున కూడా హీరో పాత్ర కాకుండా సైడ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నాడు అంటేనే ఏ లెవెల్ లో ఈ స్టోరీ కింగ్ ను ఇంప్రెస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

మరోసారి డీఎస్పీ మ్యాజిక్…

ఇలా వీరి కాంబోలో వస్తున్న Kuberaa మూవీపై ఓ రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ టీజర్ లో రాక్ స్టార్ డి.ఎస్.పి మ్యూజిక్ మరో లెవల్ అని చెప్పొచ్చు. పుష్ప 2తో ఇండస్ట్రి రికార్డులు తిరగరాసిన డిఎస్పి ఈ మూవీలో బిజిఎం కూడా అదరగొట్టాడనిపిస్తోంది. నాది నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ వచ్చిన ఈ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. డీఎస్పీ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అనిపిస్తుంది. జూన్ 20వ తేదీన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది.

Trance of Kuberaa - Teaser | Nagarjuna, Dhanush, Rashmika | DSP | Sekhar Kammula |In Cinemas June 20


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version