Sarkar Live

Sivakarthikeyan | త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో కుదిరిందా..?

Sivakarthikeyan New Movie : మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram )మెగా ఫోన్ పట్టక చాన్నాళ్ళే అవుతుంది. గుంటూరు కారం మూవీ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun)తో

Sivakarthikeyan

Sivakarthikeyan New Movie : మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram )మెగా ఫోన్ పట్టక చాన్నాళ్ళే అవుతుంది. గుంటూరు కారం మూవీ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun)తో చాలాకాలం పాటే ట్రావెల్ చేసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. మైథాలజికల్ జానర్లో సినిమా రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ కు ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉండడం తో మరికొన్నాళ్లపాటు వెయిట్ చేయక తప్పడం లేదు. దీంతో ఈ కాంబోలో మూవీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతాయని ఫిలింనగర్ నుండి టాక్ వినబడుతుంది.

ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కూడా అట్లీ వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మధ్య ఈ మూవీకి సంబంధించిన చిన్న వీడియోను కూడా నెట్టింట్లో వదిలారు.దీన్ని చూశాక ఆడియన్స్ ఇండియన్ స్క్రీన్ పై ఇంతకుముందు చూడనటువంటి ఒక మూవీ రాబోతున్నట్లు షాక్ అయిపోయారు. ఇక త్రివిక్రమ్ మాత్రం ఎవరితో మూవీ తీయాలో ప్లాన్లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం విక్టరీ వెంకటేష్ (venkatesh)తో మూవీ తీయబోతున్నట్లు రూమర్స్ వినపడ్డాయి. ఇదంతా రూమరే అని తెలిసింది.వెంకటేష్ కి ఇంకా స్టొరీ చెప్పలేదని తెలుస్తోంది.

జోరుమీదున్న Sivakarthikeyan

కానీ ఈసారి త్రివిక్రమ్ తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో మూవీ ప్లాన్ చేసినట్లు జోరుగా చర్చ నడుస్తుంది. అమరన్ మూవీ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టిన ఈ హీరో మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ మురుగదాస్ (Murugadas)తో తీయబోయే మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే త్రివిక్రమ్ ఈసారి శివ కార్తికేయను (Sivakarthikeyan )ఎంచుకున్నట్టు టాక్ వినబడుతుంది. అదే నిజమైతే గురూజీ తన మార్కెట్ ని మరింత పెంచుకునే ప్లాన్లో ఉన్నాడని పిస్తుంది. అందరు డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీస్ తీస్తుంటే గురూజీ ఇంకా ఫ్యామిలీ స్టోరీస్ నే తీస్తూ టాలీవుడ్ కె పరిమితం అయిపోయాడు.

పాన్ ఇండియన్ లెవల్ లో మూవీ..?

నెక్స్ట్ అల్లు అర్జు న్ తో తీయబోయే మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తీయాల్సి ఉంటుంది. దీనిపై ముందుగానే ఫోకస్ చేసి శివ కార్తికేయన్ (Sivakarthikeyan ) ను ఎంచుకోవడం మంచిదే. ఈ మూవీ పాన్ ఇండియన్ లెవల్లో తీసి హిట్టు కొడితే అల్లు అర్జున్ మూవీని ఇంత కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుందనడం లో సందేహం లేదు. ఏదేమైనా గురూజీ శివ కార్తికేయన్ కాంబో సెట్ అవ్వబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version