Ultra-thin Solar Panels ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సౌరశక్తి (solar power generation) అనేది దైనందిన చర్యల్లో కీలక వనరుగా మారుతోంది. కాలుష్య రహితంగా సులభమైన పద్ధతిలో అపార విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఈ విధానం ఎంతో వేగంగా విస్తరిస్తూ మరెన్నో విప్లవాత్మక మార్పులతో మనముందుకు వస్తోంది. సోలార్ సిస్టంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన సోలార్ ప్యానెల్స్ వినూత్న ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది. కాగితంగా కన్నా పలుచటి పరిమాణంతో అతి తక్కువ బరువుతో సోలార్ ప్యానల్స్ (ultra thin solar panels) మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ultra-thin Solar Panels : సాంకేతికత పుట్టిందెక్కడ?
అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ Massachusetts Institute of Technology (MIT)లోని పరిశోధకులు ఈ పల్చటి సోలార్ ప్యానల్స్‌ను ఆవిష్కరించారు. వ్లాడిమిర్ బులోవిక్ (Vladimir Bulović) అనే శాస్త్రవేత్త నేతృత్వంలో సుదీర్ఘ పరిశోధన అనంతరం వీటిని అభివృద్ధి చేశారు. ఈ ప్యానెల్స్ చాలా తేలికగా ఉంటాయి. ఇవి రబ్బరు షీట్‌లా ఉండి ఏ ఉపరితలానికైనా అతికించుకొనేలా ఆ ఉంటాయి.
ఎక్కడైనా అమర్చుకోచ్చు
ఈ అల్ట్రాథిన్ సోలార్ ప్యానల్స్ చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. వీటికి స్ట్రక్చర్ అవసరం లేదు. ఎంత ఫోల్డ్ చేసినా పనితీరు తగ్గదు. టెంట్లు, డ్రోన్లు, బోట్లు.. చివరకు దస్తులపై కూడా వీటిని అతికించుకోవచ్చు. సులభంగా మడిచి బ్యాగులో పెట్టుకోవచ్చు.
ultra thin solar panels : ఎలా తయారవుతున్నాయి ?
ముందుగా ఒక తేలికైన ప్లాస్టిక్ షీట్‌ను తీసుకొని దానిపై ఎలక్ట్రోడ్‌లను ముద్రించారు (printed). తర్వాత దాన్ని slot-die coater అనే పరికరంతో Dyneema అనే వస్త్రంపై అంటించారు. ఆ తర్వాత దాని మీద మరో ఎలక్ట్రోడ్‌ను స్క్రీన్ ప్రింట్ చేశారు.
ఎలా పని చేస్తాయి?
అల్ట్రాథిన్ సోలార్ ప్యానల్స్‌ను తయారు చేసిన పరిశోధకులు.. వాటిని పలు రకాలుగా పరిక్షించారు. ముఖ్యంగా 500 సార్లు మడిచి తిరిగి విప్పి చూశారు. అయినా అవి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాయి. ఈ సోలార్ ప్యానెల్స్ (solar panels) చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. సాధారణ ప్యానెల్స్ ఒకసారి బిగించాక కదల్చలేం. కానీ ఈ అల్ట్రాథిన్ ప్యానెల్స్‌ను మడిచి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అవసరమైన చోట విప్పి ఉపయోగించవచ్చు.
ఉపయోగాలు ఎక్కడెక్కడ?
ఈ అతి పల్చటి ప్యానెల్స్ (ultra hin solar panels)తో అనేక ఉపయోగాలు ఉంటాయని వివరిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా వరదలు, భూకంపాలు జరిగినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ క్యాంపుల్లో తాత్కాలిక విద్యుత్ అవసరం ఉంటే వీటిని వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఆర్మీ క్యాంపుల్లోనూ ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. తేలికగా వాహనాల్లో, గుడారాల్లో అమర్చవచ్చని అంటున్నారు. అలాగే చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి కాబట్టి డ్రోన్లలకు కూడా ఫిక్స్ చేయొచ్చని సూచిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని గ్రామాల్లో ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని అంటున్నారు. అలాగే బోట్లపై అమర్చి విద్యుత్ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మొబైల్ లైటింగ్ సిస్టమ్‌గా కూడా ఉపయోగించొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.