Sarkar Live

Sreeleela | లెనిన్ మూవీ నుంచి శ్రీలీల ఔట్..?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (Raghavendra Rao)దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి (Pelli sandhadi) మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల (Sreeleela) బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారి హీరోయిన్

Sreeleela

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (Raghavendra Rao)దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి (Pelli sandhadi) మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల (Sreeleela) బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారి హీరోయిన్ లకు గట్టి పోటీనే ఇస్తోంది ఈ భామ. బడా బ్యానర్లలో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Sreeleela : బాలీవుడ్ లో సినిమా మీద సినిమా..?

గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, లాంటి పెద్ద సినిమాలు శ్రీలీల ఖాతాలో ఉన్నాయి. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ దూసుకుపోతోంది.బాలీవుడ్ లో ఇబ్రహీం ఖాన్ హీరోగా దిలర్ (dilar)మూవీ, కార్తీక్ ఆర్యన్ తో మరో మూవీ చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.

క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh) క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో ఈ ఒక్క మూవీ మాత్రమే ఆమె చేతిలో ఉంది. ఈ మధ్య కొన్ని స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుని ఆడియన్స్ కి షాక్ ఇస్తోంది.నవీన్ పోలిశెట్టి హీరోగా ఆ మధ్య మొదలైన ఓ మూవీ నుండి బయటికి వచ్చింది.

భాగ్య శ్రీ బోర్సె ను ఒకే చేశారా..?

అలాగే అక్కినేని అఖిల్ (akkineni akhil) సొంత ప్రొడక్షన్ లో హీరోగా లెనిన్ (Lenin) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో శ్రీలీల గెటప్ ను కూడా చూపెట్టారు. పూర్తి పల్లెటూరు అమ్మాయిగా కనబడిన ఆ గెటప్ ను చూసి ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ రోల్ కి శ్రీలీల సరిపోదేమో అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శ్రీలీల మూవీ నుండి బయటికి వచ్చిందనే ఒక న్యూస్ మాత్రం ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ మూవీ టీం మరో హీరోయిన్ కోసం వేట కూడా మొదలుపెట్టారట. భాగ్య శ్రీ బోర్సె (Bhagya sri bhorse) ను ఫైనలైజ్ చేసినట్టు, సీన్స్ రీ షూట్ చేస్తున్నట్టు కూడా ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది. ఆడియన్స్ నుండి వచ్చిన నెగిటివ్ టాక్ వల్లే ఆమె ను మూవీ నుండి తప్పించారా లేకపోతే డేట్స్ అడ్జస్ట్ చేయలేక తనే బయిటికి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.దీనిపై మూవీ టీం ఇంతవరకు రియాక్ట్ కాలేదు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version