Sri Rama Navami : శ్రీరామనవమి వేడుకలను తెలంగాణ (Telangana Sri Rama Navami Events)లో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భద్రాచలంలో ఈ రోజు సీతారాముల కల్యాణ (Sita Rama Kalyanam) మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుణ్య సందర్భాన్ని (Bhadrachalam Festival Celebrations) తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కల్యాణాన్ని తలకించిన లక్షలాది మంది భక్తులు
శ్రీ సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియాన్ని (Mithila Stadium) అద్భుతంగా అలంకరించారు. శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం (Thirukalyana Mahotsavam) ఆరంభమైంది. అభిజిత్ లగ్నంలో జరిగిన ఈ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ మహా ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వేలాది మంది భక్తులు మిథిలా స్టేడియంలోనే కాకుండా వెలుపల ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కూడా ఈ కల్యాణాన్ని తిలకించారు.

Sri Rama Navami : మెరుగైన ఏర్పాట్లు చేసిన అధికారులు
ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం (Bhadrachalam Rama Temple) అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేశారు. అదేవిధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలను కూడా విరివిగా పంపిణీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడిపి, భక్తుల రాకపోకలకు సౌలభ్యం కల్పించింది. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రాచలానికి చేరుకోవడం విశేషం. అధికారులు మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ (Devotees at Bhadrachalam) కల్యాణ దర్శనం లభించేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు. దేవస్థానం అధికారులు, పోలీసులు, వలంటీర్లు ఎంతో చురుగ్గా విధుల్లో పాల్గొన్నారు.
తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్
ఈ కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారు రామాలయంలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా భద్రాచలంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారమే కల్యాణ మహోత్సవం సాగింది. వేదమంత్రాల మధ్య, మేళతాళాల మధ్య సీతారాముల కల్యాణం జరిగింది.
రేపు పట్టాభిషేకం
భద్రాచలంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేక (Sri Rama Pattabhishekam) మహోత్సవం జరగనుంది. ఇందులో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు. భద్రాచలంలో జరిగే ఈ ఉత్సవాలు యావత్తు రాష్ట్రానికి కాకుండా దేశానికే మోడల్‌గా నిలుస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ప్రాంతమంతా రాముని నామస్మరణతో మారుమోగింది. ఆలయ ప్రాంగణం, రోడ్లు, మార్కెట్లు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించడం జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టంగా భావించే భక్తులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.