Sarkar Live

Tea stall shut down | కేటీఆర్ పేరుతో టీస్టాల్‌.. మూసివేయించిన క‌లెక్ట‌ర్‌

Tea stall shut down : సిరిసిల్ల రాజ‌న్న జిల్లాలో చోటుచేసుకున్న ఓ సం ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చనీయాంశమైంది. కేటీఆర్ పేరు(KTR Tea Stall)తో ఉన్న ఓ టీస్టాల్‌ను క‌లెక్ట‌ర్ మూసి వేయించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ లైసెన్స్ లేక‌పోవ‌డం

Tea stall shut down

Tea stall shut down : సిరిసిల్ల రాజ‌న్న జిల్లాలో చోటుచేసుకున్న ఓ సం ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చనీయాంశమైంది. కేటీఆర్ పేరు(KTR Tea Stall)తో ఉన్న ఓ టీస్టాల్‌ను క‌లెక్ట‌ర్ మూసి వేయించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ లైసెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు.

కేటీఆర్ పేరు పెట్ట‌డం వ‌ల్లేనా Tea stall shut down?

సిరిసిల్ల రాజ‌న్న (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని బ‌తుక‌మ్మ ఘాట్ వ‌ద్ద బ‌త్తుల శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి నాలుగేళ్లుగా టీస్టాల్ నిర్వ‌హిస్తున్నాడు. దానికి కేటీఆర్ టీస్టాల్ (KTR Tea Stall ) అనే పేరు పెట్టాడు. సైన్‌బోర్డుపై కేటీఆర్ ఫొటోను కూడా ప్ర‌ద‌ర్శించాడు. ఆ ప్రాంతంలో అభివృద్ధి ప‌నుల నిమిత్తం క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఇటీవ‌ల పర్య‌టించారు. కేటీఆర్ (BRS working president KT Rama Rao) పేరుతో శ్రీ‌నివాస్ నిర్వ‌హిస్తున్న టీస్టాల్ ఆ స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ కంట‌ప‌డింద‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత అక్క‌డికి వ‌చ్చిన మునిసిప‌ల్‌ అధికారులు టీస్టాల్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గురించి ప్ర‌శ్నించారు. తానింకా అది తీసుకోలేద‌ని శ్రీ‌నివాస్ చెప్ప‌డంతో అత‌డిపై చ‌ర్య‌లు తీసుకుంటూ టీస్టాల్‌ను మూసివేయించారు. ఇది అన్యాయం అని ప‌లువురు అధికారుల చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకించ‌గా అదంతా త‌మ‌కు తెలియ‌ద‌ని, క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తోనే ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని బాధితుడు, స్థానికులు అంటున్నారు.

Tea stall shut down పై మిశ్ర‌మ అభిప్రాయాలు

ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై మిశ్ర‌మ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బ‌తుకుదెరువు కోసం టీస్టాల్ పెట్టుకున్న వ్య‌క్తిపై ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో రాజ‌కీయ కోణం లేక‌పోలేద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. త‌న వ్యాపారానికి కేటీఆర్ పేరే కాకుండా ఆయ‌న ఫొటోతో బోర్డు పెట్టుకోవ‌డం వ‌ల్లే క‌లెక్ట‌ర్ ఇలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని అంటున్నారు. ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్న సాధారణ పౌరులను ప్ర‌భుత్వం లక్ష్యంగా చేసుకుంటోంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని విమర్శిస్తున్నారు. మ‌రోవైపు ఏదైనా వ్యాపారం నిర్వ‌హించాల‌న్న‌ప్పుడు ట్రేడ్‌లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి అని, అది లేక‌పోవ‌డం వ‌ల్లే అధికారులు శ్రీ‌నివాస్‌పై చ‌ర్య తీసుకున్నార‌ని స‌మ‌ర్థిస్తున్నారు. ప‌లువురు నెటిజన్లు కలెక్టర్ చర్యలను ప్రశ్నిస్తూ.. ఇది కాంగ్రెస్ నాయకులను సంతృప్తిపరచడానికేనా? అని సందేహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే జరిమానా విధించడం సరిపోతుందని, కానీ స్టాల్‌ను పూర్తిగా మూసివేయడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు.

తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌

ఈ ఘటనపై కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. “ప్రతి విషయం గుర్తుంచుకుంటాం. ఏదీ మర్చిపోం. నేను హామీ ఇస్తున్నాను.” అని పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version