Sarkar Live

MIRAI Teaser | హాలీవుడ్ రేంజ్ లో మిరాయి టీజర్ …

MIRAI Teaser | చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఫ్యూచర్ పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా Teja sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ మిరాయి(mirayi). ఈ మూవీపై నిన్నటి వరకు

MIRAI Movie

MIRAI Teaser | చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఫ్యూచర్ పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా Teja sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ మిరాయి(mirayi). ఈ మూవీపై నిన్నటి వరకు కూడా ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు ఏమీ లేవు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుండి వస్తున్న మూవీ కాబట్టి ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. కానీ ఈ రేంజ్ లో అదరగొట్టేలా ఉంటుందని ఊహించి ఉండరు.

ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి మూవీ టీం టీజర్ కట్ చేసింది. ఎప్పుడెప్పుడు MIRAI మూవీ వస్తుందా అని ఎదురుచూసేలా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది. ఐ ఫీస్ట్ ల తీర్చిదిద్దిన టీజర్ చూస్తే ఈసారి తేజ సజ్జా కు సాలిడ్ హిట్టు గ్యారెంటీ అని సినీ లవర్స్ అనుకుంటున్నారు. డైలాగ్స్, విజువల్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ కూడా ఇది మామూలు సినిమాల అనిపించలేదు. సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

యోధుడిగా తేజ సజ్జా…

టీజర్ స్టార్టింగ్ లోనే ‘జరగబోయేది మరణ హోమం… శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం… కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీని ఆపలేదు అంటూ జయరాం చెప్పిన డైలాగులకి బ్యాగ్రౌండ్ లో కట్ చేసిన ప్రతీ ఫ్రేమ్ లో విజువల్స్ చూస్తే హాలీవుడ్ మూవీ రేంజ్ లో తెరకెక్కించారనిపించింది. ఒక వ్యక్తి ప్రమాదాన్ని సృష్టించాలని చూడగా దాన్ని ఆపేందుకు బయలుదేరే యోధుడి పాత్రలో తేజ సజ్జ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

గ్రాండ్ లుక్ తో కట్ చేసిన టీజరే ఈ లెవల్లో రెస్పాన్స్ వస్తె మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హనుమాన్ (hanuman)మూవీ సక్సెస్ లో బీజీఎం ఎంత ఇంపార్టెంట్ గా నిలిచిందో తెలిసిందే. ఆ మూవీకి మ్యూజిక్ అందించిన గౌర హరీ(goura hari)ఈ మూవీకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఇచ్చాడు.

MIRAI Movie : సెప్టెంబర్ 5న రిలీజ్…

మొదటిసారిగా విలన్ రోల్ చేస్తున్న మనోజ్ తన డైలాగ్ డెలివరీతో, యాక్టింగ్ తో తేజ సజ్జా కు గట్టి పోటీగా డీ కొడుతాడనిపించింది. ఈసారి దారి దైవం కాదు వెనకాల అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయి అని చెప్పిన డైలాగ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనడానికి ఉదాహరణకు చెప్పచ్చు. ఈ మూవీలో ఆ ఆయుధం కీ రోల్ అని చెప్పొచ్చు. యోధుడు తేజ సజ్జా ఆ ఆయుధంతో ఆ శక్తులను ఎలా ఎదుర్కున్నా డో ఆసక్తికరంగా ఉండబోతుందని అనిపిస్తుంది. సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న మిరాయి సృష్టించే అద్భుతాలను చూసేందుకు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

Mirai Telugu Teaser | Teja Sajja | Manchu Manoj | Karthik Gattamneni | People Media Factory


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version