Intermediate Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ (Telangana Intermediate Board) వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation Process) తుది దశకు చేరుకుంది. మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఏప్రిల్ 10తో ముగియనుంది. ఈసారి ఫలితాల్లో (Intermediate Results) తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు ఎన్నడూ లేని విధంగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘రీఫెరెన్స్ మూల్యాంకన’ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
ఏమిటా కొత్త విధానం?
మూల్యాంకనం పూర్తయిన జవాబు పత్రాలను మరోసారి రీచెక్ (Random Slot Rechecking) చేయడం ద్వారా విద్యార్థులకు కచ్చితమైన మార్కులు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే.. మొదట మూల్యాంకన పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని జవాబు పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని ర్యాండమ్ స్లాట్లు (Random Slots) ఎంపిక చేసి వాటిలోకి వచ్చే విద్యార్థుల ఆన్సర్ షీట్లను రెండోసారి జాగ్రత్తగా పరిశీలించనున్నారు.
ఎందుకు ఈ నిర్ణయం?
గతంలో ఫలితాల ప్రకటన (Intermediate Results) తర్వాత అనేక మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్ (Re-evaluation Process), రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసి మార్కులు పెంచించుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి మొదట 0 మార్కులు వచ్చి, రీవాల్యుయేషన్ తర్వాత 99 మార్కులు రావడం వంటి ఘోర తప్పిదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. మార్కుల కచ్చితత్వంపై ఇంటర్ బోర్డు నమ్మకాన్ని కోల్పోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఏదైనా తప్పిదం జరగకూడదని బోర్డు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొంత ఆలస్యమైనా కచ్చితమైన ఫలితాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు?
మార్చి 3 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఈ నెల చివర్లో ఫలితాలు (Intermediate Results) విడుదల చేసే అవకాశముంది. అదే రోజు రీ వాల్యుయేషన్, రీకౌంటింగ్ ప్రక్రియల వివరాలు కూడా వెల్లడించనున్నారు.
ర్యాండమ్ స్లాట్లు ఎలా ఉన్నాయి?
ఇంటర్ బోర్డు (Telangana Intermediate Board) తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఐదు విభిన్న రేంజ్‌ల ను ఎంపిక చేశారు:
- 0 మార్కులు వచ్చిన విద్యార్థులు
- 1 నుంచి 10 మార్కుల మధ్య ఉన్నవారు
- 25 నుంచి 35 మార్కులు ఉన్నవారు (పాస్ మార్కులకు సమీపం)
- 60 నుంచి 70 మార్కులు ఉన్నవారు (సగటు విద్యార్థులు)
- 95 నుంచి 99 మార్కులు పొందినవారు (టాపర్లు)
ఈ శ్రేణుల్లోకి వచ్చే జవాబు పత్రాలను ప్రత్యేకంగా రీ వాల్యుయేట్ (Re-evaluation Process) చేస్తున్నారు. దీనివల్ల రీసల్ట్‌లో టాప్ చేసే విద్యార్థుల దగ్గరి నుండి ఫెయిల్ అయే విద్యార్థుల వరకు అన్ని కేటగిరీల్లో నిష్పక్షపాతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎక్కడ జరుగుతోంది ఈ ప్రక్రియ?
తెలంగాణ రాష్ట్రంలోని 19 స్పాట్ వెల్యుయేషన్ సెంటర్లలో మంగళవారం (ఏప్రిల్ 8) నుంచి ఈ ర్యాండమ్ రీ వాల్యుయేషన్ మొదలైంది. మొదటి మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం మూడు రోజుల పాటు ర్యాండమ్ ఆన్సర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయనున్నారు.
ఫలితాలపై నమ్మకం పెరిగేలా…
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Intermediate Board) తీసుకుంటున్న ఈ కొత్త చర్యలు విద్యార్థులకు న్యాయం చేయడం, ఫలితాల్లో నమ్మకాన్ని తీసుకురావడం కోసం ఎంతో కీలకంగా మారనున్నాయి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినా అవి కచ్చితంగా ఉండాలని ప్రతిపాదన తీసుకుని పనిచేస్తుండటం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. జవాబు పత్రాల్లో తప్పులు లేకుండా చూస్తే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అవసరం తగ్గుతుంది. ఇంటర్ ఫలితాల కోసం ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫలితాలు కచ్చితంగా ఉండాలని ఆశిస్తున్నారు.
ఇంటర్‌బోర్డు చర్యలపై హర్షం
ఇంతవరకు ప్రతి సంవత్సరం సుమారు 50 వేల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ (Re-evaluation) లేదా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేస్తూ వస్తున్నారు. చాలామంది ఇందులో మార్కులు పెంచించుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా రీ వాల్యుయేషన్ తర్వాత పాసయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇలాంటి తప్పులు జరగకుండా ముందుగానే పరిష్కార మార్గాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.