Thandel Movie సంక్రాంతికి బడా సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. మూడు సినిమాలు పెద్ద బ్యానర్ లోనే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చింది. అలాగే సూర్య దేవర నాగవంశీ ప్రొడక్షన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ దిల్ రాజు బ్యానర్ లోనే వచ్చి 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇంకా ఫుల్ రన్ లో ఉంది. ఇక ఈ మూడు బడా సినిమాల హడావిడి తగ్గినట్టే..
Thandel Movie Release date : ఫిబ్రవరి 7న రిలీజ్
ఫిబ్రవరి 7న తండేల్ (Thandel) మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగచైతన్య,సాయి పల్లవి(Naga Chaitanya, Sai Pallavi) జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Banni vasu) ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాటలతో, మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ మూవీ మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంది.
అయితే అల్లు అరవింద్ బ్యానర్ పై వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుందంటే పక్కా స్టోరీలో దమ్ము ఉంటుందనే ఆలోచనలో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతారు.ఇక నాగచైతన్యతో సాయి పల్లవి కాంబినేషన్ లవ్ స్టోరీ మూవీ తో మనకు తెలిసిందే. తండెల్ మూవీ ట్రైలర్ లో కూడా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. ఇలా ఈ మూవీపై ఒక హైప్ వచ్చింది.
అల్లు అరవింద్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతుంది కాబట్టి ఆయా భాషల్లోని పెద్ద పెద్ద హీరోలతో ట్రైలర్లను విడుదల చేస్తున్నారు. తమిళ్ లో సూర్యతో, హిందీలో అమీర్ ఖాన్ తో ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇలా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసేలా ప్రతీది జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్.
ఇలాంటి మూవీ పై పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ (Sairam Shankar) పోటీకి దిగుతున్నాడు. అతడు హీరోగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ ప్రొడ్యూసర్స్ గా వినోద్ విజయన్ డైరెక్షన్లో నటించిన మూవీని తండేల్ మూవీ రిలీజ్ రోజున రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో అషిమా నర్వాల్, శ్రుతి సోది హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా సముద్రఖని కీలకపాత్రలో కనిపించనున్నారు.
సాయిరాం శంకర్ పూరి జగన్నాథ్ వద్ద మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన డైరెక్షన్ లోనే 143 అనే మూవీ తో హీరోగా మారాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. రవితేజ నటించిన నేనింతే మూవీలో సాయి అనే రోల్ లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత పూరి బ్యానర్ లో వచ్చిన బంపర్ ఆఫర్ అనే మూవీతో బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా వచ్చిన మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. డైరెక్టర్ తేజాతో వెయ్యి అబద్దాలు తీసిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చిన్న చిన్న సినిమాలు హీరోగా చేసిన అవి అతడి కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు.
చాలా రోజుల తర్వాత ఒక క్రైమ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ మూవీ ఇంటర్వెల్ టైమ్ లో హంతకుడు ఎవరో కనిపెడితే ప్రతీ ధియేటర్ లో పదివేల రూపాయల గిఫ్ట్ ఇస్తామని కూడా ప్రకటించారంటే మేకర్స్ ఈ మూవీపై గట్టి నమ్మకం గానే ఉన్నారని తెలుస్తోంది.
ఏమైనా తండేల్ మూవీకి పోటీగా దిగడం సాయి చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అని సినీ పండితులు అనుకుంటున్నారు. తండేల్ రిలీజ్ కు కొన్ని రోజుల ముందు లేదా ఆ మూవీ విడుదలయ్యాక కొన్ని రోజుల తర్వాతనో రిలీజ్ చేయాల్సి ఉండేదని అంటున్నారు. కానీ మూవీ టీమ్ మాత్రం ఇవేవీ పట్టించుకాకుండా అదే తేదీన థియేటర్లకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి సాయి నటిస్తున్న మూవీ ఈ వారంలోనే బయటపడాల్సి ఉంటుంది.
ఇలా తండేల్ మూవీకి మాత్రమే పోటీగా కాకుండా ఆ మూవీకి ఒక రోజు ముందు విడుదలయ్యే అజిత్ పట్టుదల మూవీ కి కూడా పోటీగా వచ్చి సాయి పెద్ద రిస్కే చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అజిత్ కి కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తె కలెక్ష్లతో సునామీ గ్యారెంటీ. ఏదేమైనా సాయి రాం శంకర్ రెండు బడా సినిమాల తాకిడి తట్టుకుని తన మూవీ మీద నమ్మకంతో పోటీకి దిగుతున్నా రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి మరి..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..