Tirupati flight cancelled : హైదరాబాద్ నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాల్సిన విమానం రద్దు అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బుధవారం ఉదయం షంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి తిరుపతికి (Tirupati) బయల్దేరాల్సిన విమానం అనుకోని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యింది. దీంతో విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
ముందస్తు సమాచారం ఇవ్వొచ్చు కదా..!
తిరుపతి విమానంలో ఏడుగురు (Passengers) ప్రయాణించాల్సిన ఉండగా వారు కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వచ్చింది. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. సాంకేతిక లోపాల కారణంగా విమానాన్ని రద్దు చేశామని సిబ్బంది చివరకు ప్రకటించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. విమానం రద్దయిన కారణంగా తమ దర్శన సమయాన్ని మిస్ అవుతామని ఆందోళన చెందారు. కొన్ని గంటల ముందుగానే రిపోర్ట్ చేసిన ప్రయాణికులు అంత సేపు ఎదురు చూడాల్సి వచ్చిందని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం అన్యాయమని సిబ్బందిపై మండిపడ్డారు.
Tirupati flight cancelled .. నిర్లక్ష్యం ఇలా?
విమానాన్ని రద్దు చేయడంపై ప్రయాణికులు విమానయాన సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రయాణ ఖర్చులు వృథా కావడమే కాకుండా తిరుమల దర్శనానికి సమయానికి చేరుకోలేకపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాల్లో సాంకేతిక లోపాలు సహజమే అయినప్పటికీ రద్దు చేసిన విషయాన్ని ముందుగా తెలియజేడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పైగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో చెప్పకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా విమానాన్ని రద్దు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు.
డబ్బులు వాపస్ తీసుకొని ఏం చేయాలి?
విమానయాన సంస్థ అధికారులు ఈ సంఘటనపై స్పందిస్తూ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని, సాంకేతిక లోపం వల్ల విమానం రద్దు చేయాల్సి వచ్చిన దృష్ట్యా త్వరలోనే వారికి రీఫండ్ చేస్తామని అన్నారు. దీనిపై ప్రయాణికుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. తక్షణమే తిరుమలకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే తాము విమానం టికెట్ బుక్ చేసుకున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా కేవలం డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటే ఎలా? అని నిలదీశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..