FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగదారులు రెట్టింపు చార్జలు చెల్లించాలని నిబంధనను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్రవరి 17) నుంచి అమల్లోకి వచ్చింది.
FASTag New Rules 2025 : పాటించకుంటే డబుల్ వడ్డింపు
సాధారణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జరగవు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో తమ ఫాస్టాగ్ ఖాతాను సరిచేసుకోవాలి. లేదంటే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి ఎందుకు వెళుతుంది?
- తగినంత బ్యాలెన్స్ లేకపోవడం : ఫాస్టాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే టోల్ చార్జీలు చెల్లించబడవు. ఫలితంగా ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళుతుంది.
- కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం : ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ లేదా సంస్థకు అవసరమైన కేవైసీ వివరాలు అందించకపోతే ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి చేరుతుంది.
- వాహన వివరాలు సరిపోలకపోవడం : ఫాస్టాగ్‌లో ఉన్న వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు వాస్తవ వాహన వివరాలతో సరిపోలకపోతే ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళుతుంది. బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు ఏం చేయాలి?
ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్లినట్లయితే వినియోగదారులు 70 నిమిషాలలోగా ఈ కింది చర్యలను తీసుకోవాలి.
- FASTag New Rules బ్యాలెన్స్ రీచార్జ్ చేయడం : ఫాస్టాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే, వెంటనే 70 నిమిషాల్లోగా రీచార్జ్ చేయాలి.
- కేవైసీ వివరాలు అప్డేట్ చేయడం : కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే, సంబంధిత బ్యాంక్ లేదా సంస్థతో సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్లు అందించి కేవైసీని పూర్తి చేయాలి.
- వాహన వివరాలు సరిచూడటం : ఫాస్టాగ్‌లో ఉన్న వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు వాస్తవ వాహన వివరాలతో సరిపోతున్నాయా ? అని పరిశలించాలి. అవసరమైతే సంబంధిత సంస్థతో సంప్రదించి వివరాలను సరిచేయాలి.
70 నిమిషాల వ్యవధి ఎందుకు ముఖ్యం?
ఫాస్టాగ్ బ్లాక్ లిస్టు (FASTag Black list) లోకి వెళ్లిన తర్వాత 70 నిమిషాల లోగా చర్యలను తీసుకోకపోతే టోల్ ప్లాజాల వద్ద ట్రాన్సాక్షన్లు తిరస్కరించబడతాయి. అలాగే, ఈ సమయంలోగా సమస్యను పరిష్కరించకపోతే టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటలకు మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్లిందని అనుకుందాం. మీరు 10:30 గంటలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నప్పుడు మీ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. అయితే… 70 నిమిషాల లోపు, అంటే 10:10 గంటల లోగా మీరు ఫాస్టాగ్ బ్యాలెన్స్ రీచార్జ్ చేయడం లేదా కేవైసీ వివరాలు అప్డేట్ చేయడం ద్వారా ఫాస్టాగ్‌ను పునరుద్ధరించుకొని విజయవంతంగా చెల్లింపులు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..