Sarkar Live

Ugadi 2025 : ఉగాది ముహూత్రం ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?

Ugadi 2025 : ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటకలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే హిందూ పండుగ ఉగాది. భారతదేశం అంతటా, ఉగాదిని మహారాష్ట్రలో గుడి పడ్వా, తమిళనాడులో పుతాండు, అస్సాంలో బిహు, పంజాబ్‌లో వైశాఖి, ఒడిశాలో పానా సంక్రాంతి

Ugadi 2025

Ugadi 2025 : ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటకలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే హిందూ పండుగ ఉగాది. భారతదేశం అంతటా, ఉగాదిని మహారాష్ట్రలో గుడి పడ్వా, తమిళనాడులో పుతాండు, అస్సాంలో బిహు, పంజాబ్‌లో వైశాఖి, ఒడిశాలో పానా సంక్రాంతి పశ్చిమ బెంగాల్‌లో నబా బర్షా అని వివిధ పేర్లతో పిలుస్తారు.

ఉగాది ప్రాముఖ్యత

Ugadi 2025 Significance : యుగాదిలో “యుగం” అనే పదానికి ఒక యుగం అని అర్థం, “ఆది” అంటే కొత్తదనాన్ని సూచిస్తుంది. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కర I ఉగాదిని నూతన సంవత్సర ప్రారంభంగా గుర్తించారు, ఎందుకంటే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతీక జ్యోతిషశాస్త్రం పరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. రాబోయే సంవత్సరంలో జరిగే సంఘటనలను అంచనా వేయడానికి ప్రజలందరూ ఈరోజు పంచాంగం చదవడానికి ఆసక్తి చూపుతారు.

సూర్య-చంద్ర క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది పంటకోత పండుగ, అందువల్ల సాంస్కృతికంగా హిందూవులకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Ugadi 2025 : తేదీ, సమయం ముహూర్తం

ఈ సంవత్సరం ఉగాది మార్చి 30, 2025న జరుపుకుంటారు. తిథి మార్చి 29, 2025న సాయంత్రం 04:27 గంటలకు ప్రారంభమై మార్చి 30, 2025న మధ్యాహ్నం 12:49 గంటలకు ముగుస్తుంది.

Ugadi 2025 ఆచారాలు, సంప్రదాయాలు

  1. ఇళ్లను శుభ్రపరచడం అలంకరించడం: తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలను కడతారు. రంగురంగు ముగ్గులతో ముంగిళ్లను అలంకరిస్తారు. ఇది చెడుతను దూరం చేసి మంచిని స్వాగతించడాన్ని సూచిస్తుంది.
  2. ఉగాది పూజ: భక్తులు సంపన్న సంవత్సరం కోసం దేవతలను పూజిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పూజ సమయంలో పండ్లు, పువ్వులు, ప్రత్యేక వంటకాలు చేసి దేవీదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు.
  3. ఉగాది పచ్చడి : వేప పువ్వులు, బెల్లం, చింతపండు, ఉప్పు, పచ్చి మామిడికాయలు, షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇదే ఉగాది పర్వదినానికి ప్రత్యేకమైనది.. ఇది జీవితంలోని వివిధ భావోద్వేగాల సమతుల్యతను సూచిస్తుంది. దేవతల చిత్రపటాల వద్ద పిల్లలు తమ పుస్తకాలు, తమకు ఇష్టమైన వస్తువులను ఉంచి పూజలు చేస్తారు.
  4. కొత్త బట్టలు: కొత్త బట్టలు ధరించడం అనేది రాబోయే సంవత్సరంలో కొత్త ప్రారంభం, కొత్త ప్రారంభాలను సూచిస్తుంది.

ఉగాది అనేది ఆనందం, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ ఉత్సవాలతో నిండిన రోజు. ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి వస్తారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version