Equivalence certificate : విదేశాల్లో చదివిన (foreign qualifications) విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చి ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించాలనుకున్నా లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్నా పెద్ద సమస్యే. విదేశాల్లో వారు పొందిన డిగ్రీ (foreign degrees)కి భారతదేశంలో గుర్తింపు ఉండదు. దీంతో యువత అనేక అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చినా భారత్లో ఆ ధ్రువీకరణ పత్రాలు చెల్లవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యూజీసీ (University Grants Commission) ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశీ డిగ్రీలను పరిశీలించి, అవి సరైనవి అని తేలితే వాటికి సత్సమాన సర్టిఫికెట్ (Equivalence Certificate) జారీ చేయాలని నిర్ణయించింది.
ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారు?
చాలా మంది భారతీయులు విదేశాల్లో (foreign educational institutions) చదువుకొని తిరిగి భారత్కు వచ్చాక, వారి డిగ్రీలు అమోదం పొందడం లేదు. దీంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు నకిలీ డిగ్రీలు వాడటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. సరైన ప్రమాణాలు లేని కోర్సులు కొన్ని ఇక్కడ గుర్తింపు పొందలేకపోతున్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు యూజీసీ ఒక స్పష్టమై, పారదర్శకమైన విధానాన్ని (Equivalence Certificate) ప్రవేశపెడుతోంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
- ఆన్లైన్ అప్లికేషన్: UGC ఒక ప్రత్యేక వెబ్సైట్ లేదా పోర్టల్ ప్రారంభిస్తుంది. విదేశీ డిగ్రీ ఉన్నవారు తమ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితా, ఆ దేశంలోని గుర్తింపు వివరాలు, అవసరమైన ఇతర డాక్యుమెంట్లు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- నిపుణుల కమిటీ పరిశీలన: యూజీసీ (UGC) రూపొందించిన నిపుణుల బృందం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఆ డిగ్రీ నిజమైనదా? ఆ దేశంలో గుర్తింపు ఉన్నదా? అన్నదాన్ని పరిశీలిస్తుంది. అన్ని సరిగా ఉంటే సత్సమాన సర్టిఫికెట్ జారీ చేస్తారు.
- రివ్యూకు అవకాశం: ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ రివ్యూ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం ప్రత్యేక రివ్యూ కమిటీ ఉంటుంది.
అసలైన డిగ్రీలకు ప్రామాణికం ఏమిటి?
- అసలైన విదేశీ డిగ్రీలు : గుర్తింపు పొందిన దేశీయ లేదా అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి వచ్చినవే సరైనవి.
- ఫ్రాంచైజీ (Franchise) ద్వారా వచ్చిన డిగ్రీలు : భారతదేశంలో ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ విదేశీ పేరు మీద కోర్సులు నిర్వహిస్తే, అలా పొందిన డిగ్రీలకు గుర్తింపు ఉండదు.
- ఆఫ్షోర్ క్యాంపస్లు : విదేశీ యూనివర్సిటీల విదేశాల్లో ఉన్న బ్రాంచ్లలో చదివితే కొన్ని షరతులపై గుర్తింపు ఉంటుంది.
- ప్రొఫెషనల్ కోర్సులకు వర్తించదు : మెడిసిన్, లా, నర్సింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులు వేరు. వీటికి సంబంధించి ఇతర నియంత్రణ మండళ్లు నిర్ణయిస్తాయి.
Equivalence Certificate : ఎవరికి ఉపయోగం?
- విదేశాల్లో ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్, హ్యూమానిటీస్ చదివిన విద్యార్థులు.
- విదేశీ డిగ్రీలు కలిగిన వారు భారతదేశంలో PG, PhD చేయాలనుకునే విద్యార్థులు.
- ఇండియాలో సర్కారు ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలు కోసం అర్హత చూపించాలనుకునే వారు.
కొత్త విధానం ద్వారా విదేశీ డిగ్రీలకు విలువ
విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఈ కొత్త విధానం (Equivalence Certificate) ద్వారా ఒక స్పష్టత, న్యాయం లభిస్తుంది. అలాగే నకిలీ డిగ్రీలు వాడే వారిని నియంత్రించొచ్చు. తద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
దీనిపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ (UGC Chairman Prof M Jagadesh Kumar) మాట్లాడుతూ “విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వారి డిగ్రీలకు విలువ లభిస్తుంది. అలాగే ఫేక్, గుర్తింపు లేని యూనివర్సిటీల ద్వారా పొందిన డిగ్రీలను ఈ విధానం ద్వారా నిరాకరించడం వల్ల భారతదేశ విద్యా వ్యవస్థను కాపాడిన వాళ్లవుతాం” అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.