Sarkar Live

Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్

Victory Venkatesh

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అనుకుంటారు. అందులో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి.

ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని ఆడియన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ యాక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి (Nuvvu Naku Nacchav, Mallishvari) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి మాటల రచయితగా పనిచేసారు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తున్నట్టు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆడియన్స్ కి పండుగ లాంటి వార్తే అని చెప్పొచ్చు.

ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తే రికార్డులే..

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఈ సినిమాలు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటిపోయిన కూడా ఇప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉండే ఈ మూవీస్ వెంకటేష్ (Victory Venkatesh) చెప్పే డైలాగులకు, అందులోని ఎమోషన్స్ కి ఫిదా అయిపోయారు. ఎమోషన్స్ కి పెద్దపీట వేసే త్రివిక్రమ్, ఎమోషన్స్ తో ఇండస్ట్రీ హిట్లు కొట్టే వెంకటేష్ కలిసి మూవీ చేస్తున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టకుండా ఉంటారా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.బాక్సాఫీస్ దగ్గర సందడి మామూలుగా ఉండదని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Victory Venkatesh : ఫ్యామిలీ జానర్ లోనే మూవీ..?

అక్చువల్ గా ఈ మూవీ కంటే ముందే త్రివిక్రమ్ అల్లుఅర్జున్ తో ఓ మూవీ చేయాల్సింది. దాదాపు ఆ కథ పై సంవత్సరం పైనే ట్రావెల్ చేశాడు. ఆ మూవీ తెరకెక్కడానికి ఇంకా సమయం ఉండగా అల్లు అర్జున్ అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో ఎంత లేదన్న ఏడెనిమిది నెలలు పట్టొచ్చు. ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో మూవీ చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. కథ కూడా వెంకటేష్ (Victory Venkatesh) కు చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో మూవీ సెట్ అయిందంటే ఫ్యామిలీ జానర్ లోనే తెరకెక్కుతుంది అని ఆయన ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్ లు మళ్ళీ కర్చీఫ్ లతో నిండిపోవడం ఖాయం అని సంబరపడిపోతున్నారు


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version