Sarkar Live

Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’

విజయ్ సేతుపతి( Vijay sethupathi )కి తెలుగు, తమిళంలో ఉన్న క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాత్ర నచ్చితే విలన్ గా కూడా చేసి మెప్పిస్తుంటాడు. పాత్ర చిన్నదా పెద్దదా ఆలోచించడు. నచ్చితే చేయడమే..ఇటీవలే

Vijay sethupathi

విజయ్ సేతుపతి( Vijay sethupathi )కి తెలుగు, తమిళంలో ఉన్న క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాత్ర నచ్చితే విలన్ గా కూడా చేసి మెప్పిస్తుంటాడు.

పాత్ర చిన్నదా పెద్దదా ఆలోచించడు. నచ్చితే చేయడమే..ఇటీవలే విడుదల -2 (Vidudhala -2) మూవీలో తన నటనకి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే. వెట్రిమారన్ (Vetrimaran)డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మంచి నటుడనే పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కి కమర్షియల్ గా ఆయన రేంజ్ లో ఒక పెద్ద స్టార్ కి ఉన్న కలెక్షన్స్ మాత్రం లేవు. తన 50 వ సినిమాగా మంచి కంటెంట్ తో వచ్చిన మహారాజ (Maharaja) మూవీ సూపర్ సక్సెస్ అయింది.

మంచి కంటెంట్ కు విజయ్ సేతుపతి (Vijay sethupathi ) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని డబ్ చేసి చైనా లో విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకులు కూడా ఆదరించి విజయాన్ని అందించారు.

చైనాలో 91 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ఆడుతున్న ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. అక్కడ విడుదలైన సినిమాల్లో కొన్ని మాత్రమే ఈ రేంజ్ లో హిట్టయ్యాయి. ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా చేరిపోయింది. మొత్తానికి ఈ మూవీ చైనా లో దుమ్ము దులుపుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

One thought on “Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version