- ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర
- పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త
Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్ (Ameenpur) పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి
వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను కూడా చంపాలని ఆమె డిసైడ్ అయింది. కానీ అతడు పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది.
Ameenpur Murder Case : విచారణ తర్వాత వెలుగులోకి అసలు బగోతం
కాగా Ameenpur కేసులో పోలీసులు ముందుగా భర్తను అనుమానించారు. సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత భార్య రజిత అసలు బాగోతం బయటపడింది. కొన్నాళ్ల క్రితం రజిత తన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఓ స్నేహితుడితో ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధానికి పిల్లలు అడ్డు వస్తున్నారనే కారణంతో వాళ్లను చంపాలని రజిత పన్నాగం వేసింది.
ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించింది. అయితే భర్త చెన్నయ్య ఆరోజు పెరుగు తినకుండా భోజనం ముగించాడు. తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పని కోసం బయటకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చాక చూస్తే పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. ముగ్గురు పిల్లలు 12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధు ప్రియ, 8 ఏళ్ల గౌతమ్ మృతి చెందారు.ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని, తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యానని రజిత చెప్పడంతో ఆమెను భర్త చెన్నయ్య హాస్పిటల్‌లో చేర్పించాడు. చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన దారుణం బయటపడింది. రజితతోపాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..