Sarkar Live

State

​ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం
warangal

​ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ​దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు ​గత 19 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.​ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ​వడ్డేపల్లి భరత్,​గొర్రె చెరాలు,​అప్రధపు సారంగపాణి,​మంతిని చక్రధర్,​పొన్నం కుమారస్వామి,​కామ్మ రామ్మోహన్,​తోట వీరభద్రం,​కొత్తపల్లి శ్రీను​గుడికందుల ప్రగత్,​గుణల మధుతోపాటు&n...
ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్
Hyderabad

ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్

•ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదు •తెలంగాణలో మావోయిజం అంతమైందని వ్యాఖ్య •గ్రేహౌండ్స్ విభాగంలో భారీ మార్పులు.. 1700 మంది సిబ్బంది బదిలీగంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి తెలంగాణలో ఇకపై "ఫ్రెండ్లీ పోలీసింగ్" అనే విధానానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రజలకు గౌరవం ఇస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రస్తుతం మావోయిజం అంతరించిపోయిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. గ్రేహౌండ్స్ విభాగంలో కీలక మార్పులు చేపడుతున్నామని వెల్లడించిన డీజీపీ, ఆ విభాగంలోని సుమారు 1700 మంది సిబ్బందిని...
State, Hyderabad
•ఏసీబీ వలలో R&B ఈఎన్సీ మోహన్ నాయక్: 11 చోట్ల ఏకకాలంలో సోదాలు! •ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ మెరుపు దాడులు ​•ఇప్పటివరకు రూ.60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు లభ్యం ​•ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అవినీతి తిమింగలం గుట్టురట్టు ​తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్ అవినీతి సామ్రాజ్యంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విరుచుకుపడ్డారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు భారీ సోదాలు చేపట్టారు. ​హైదరాబాద్‌లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువులకు చెందిన మొత్తం 11 ప్రాంతాలలో 16 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ​కట్టల కొద్దీ నోట్లు.. లీటర్ల కొద్దీ మద్యం! ​ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ జాయింట్ డైరెక్టర...
తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!
Hyderabad

తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై నిప్పులు చెరిగారు. ​‘తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే..’ – మంత్రి పొన్నం ప్రభాకర్ ​పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ​"తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు. ఇక్కడి మట్టితో మాకు పేగు బంధం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ​తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కు లేదనే విషయాన్ని స్వయంగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? ప్రాణాలర్పించిన అమరవీరుల కు...
చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం
State, warangal

చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం

ఉమ్మడి ఉత్తర తెలంగాణ రవాణా, విద్యా రంగాలకే కాకుండా.. త్వరలోనే అత్యాధునిక వైద్యసేవలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. వరంగల్ సెంట్రల్ జైలు పాత ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల (G+24 Floors) మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Warangal Super Specialty Hospital) పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సుమారు రూ.1,150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ఆసుపత్రి భవనం, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, పేద-మధ్యతరగతి వర్గాలకు హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) లేదా కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి వైద్యసేవలను స్థానికంగానే అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రధాన సూపర్ స్పెషాలిటీ విభాగాలులభించబోయే అత్యాధునిక సేవలుకార్డియాలజీ & కార్డియోథొరాసిక్గుండె జబ్బులు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, బైపాస్ ఆపరేషన్లునెఫ్రాలజీ & యూరాలజీ...
error: Content is protected !!