లంచం అడిగితే.. చెప్పులతో కొట్టారు! ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుడి దాడి – RTC Ticket Inspector Attack
RTC Ticket Inspector Attack | సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ తనిఖీల సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు నిబంధనల ఉల్లంఘన, మరోవైపు అధికారి లంచం డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్, ప్రయాణికుడు చెప్పులతో దాడి చేసే స్థాయికి చేరుకుంది.
అసలేం జరిగింది?
హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ కోసం ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సాధారణంగా టికెట్ లేని ప్రయాణికుడికి జరిమానా విధించడం, కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం నిబంధన. అయితే, ఈ కేసు నమోదు కాకుండా ఉండాలంటే తనకు రూ. 20 వేల లంచం ఇవ్వాలని అధికారి ప్రకాష్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
అంత పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో ఆగ్రహాన...




