Lucknow bank heist | లక్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితుల మృతి..
Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లారు (Bank Loot ). ఈ క్రమంలో పోలీసులు పలుచోట్ల ఎన్‌కౌంటర్లు చేపట్టగా ఇద్దరు హతమయ్యారు.
Lucknow Encounter : లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో పోలీసులకు, నిందితులకు మధ్య జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో నిందితుడు సోబింద్ కుమార్ (29) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్
ఉత...
