TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..
ఐ పీ ఎస్ కావాల్సిన నేను ఆర్టీసీలో కి వచ్చానని "ధర్మం"గా ప్రచారం చేసుకున్న అధికారి..
సమ్మెకాలంలో "ఓడి"ల పేరుతో సదరు అధికారి లక్షలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు..
ఆ అధికారి మాయలు "బాపు"కే తెలుసని భూపాలపల్లి లో జోరుగా ప్రచారం
విజిలెన్స్ విచారణ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం..
TGSRTC Bhupalpally : ఆర్టీసీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారి ఓ డిపో మేనేజర్ గా ఉన్నప్పుడు" లక్ష్మీ" ని అ"ధర్మం" గా తన జేబులోకి మళ్లించినట్లు ఉద్యోగులు కోడై కూస్తున్నారు. ఆర్టీసీలో డి.వీ.ఎం గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి తాను ఓ డిపో మేనేజర్ గా విధులు నిర్వహించినప్పుడు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. సమ్మె కాలంలో తన ఇష్టానుసారంగా వ్యవహరించి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను "ఐపిఎస్ "కావాల్సిన వాడినని అనుకోకుండా ఆర్టీసీలోకి వచ్చానని, సదరు అధికారి ...
