Bengaluru : రాంగ్ రూట్ లో వెళ్లిన ఆటో డ్రైవర్.. భయంతో దూకేసిన మహిళ
Bengaluru Auto-rickshaw : బెంగళూరులో గురువారం రాత్రి కదులుతున్న ఆటో రిక్షా (Auto-rickshaw) నుంచి 30 ఏళ్ల మహిళ దూకేసింది. ఆమె తను వెళ్లాల్సిన దారి గురించి స్పష్టంగా ఆటో డ్రైవర్ కు చెప్పినా కూడా అతడు పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్లాడు. డ్రైవర్ తెలియని మార్గం వైపు వెళుతున్నాడని గమనించి వెంటనే సదరు మహిళ ఆటోలో నుంచి దూకేసింది.
బెంగళూరులోని తన ఇంటికి వెళ్లేందుకు ఆ మహిళ ‘నమ్మ యాత్రి’ యాప్ (Namma Yatri app) ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్ సాధారణ మార్గాన్ని అనుసరించకుండా హెబ్బాల్ వైపు వెళ్లడం ప్రారంభించడంతో ఆమె ఆందోళనకు గురైంది. పదేపదే ప్రశ్నించిన తర్వాత, డ్రైవర్ స్పందించకపోవడంతో మహిళ వెంటనే ఆటో నుంచి దూకి తప్పించుకుంది.
ఆమె భర్త, అజహర్ ఖాన్, సోషల్ మీడియాలో ఈ భయంకరమైన అనుభవాన్ని షేర్ చేశారు. తన భద్రత గురించి ఆందోళన చెందిన మహిళ, డ్రైవర్ కళ్ళు ఎర్రబడటం, మత్తులో ఉ...
