Mahakumbh Mela : జనసంద్రంగా త్రివేణి సంగమం.. మహాకుంభమేళాలో అమృత స్నానం
Mahakumbh Mela 2025 : త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. మహా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయడంలో ఆ ప్రదేశమంతా మహా సందడిగా మారింది. ఈ పుణ్యస్నానాల ఘట్టం మూడు రోజులుగా సాగుతుండగా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు.
పూల వర్షం కురిపించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంగా మారింది. దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద ఇప్పటికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించారని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొనసాగుతుండగా బుధవారం కూడా అశేష భక్తజనం దీనిని ఆచరించారని తెలిపింది. మంగళవారం అమృత్ స్నానం తర్వాత భక్తులపై ఆ...

