Komuravelli Jatara 2025 : నేటి నుంచే కొమురవెల్లి మల్లన్న జాతర
Komuravelli Jatara 2025 : సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి జాతర జనవరి 19 నుంచి ప్రారంభమవుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మల్లన్న జాతర ప్రారంభమై సుమారు మూడు నెలలపాటు అంటే ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజున ముగుస్తుంది.
Komuravelli Jatara 2025 : ప్రతీ ఆదివారం సందడే సందడి..
జాతర రోజుల్లో ఆలయంలో ప్రతీ ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెద్దం సంఖ్యలో భక్తులు ఇక్కడికి ముందుగానే వచ్చి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి స్వామివారి కల్యాణం జరిపించి మొక్కులను చెల్లించుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఇలా ఉంటే కొమురవెల్లి జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు వస్తారు. తెలంగాణకు సంబ...
