Rythu Runa Mafi : రైతులకు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president KT Rama Rao) నిప్పులు చెరిగారు. రైతుల పంట రుణమాఫీ (Rythu Runa Mafi) ని పూర్తిగా అమలు చేశామని చెబుతూ సీఎం చేసిన ప్రకటనలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. దీనికి సీఎం (Chief Minister A Revanth Reddy) రైతులపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ అబద్ధాలను మీ మంత్రే బయట పెట్టారు
రేవంత్‌రెడ్డి అబద్ధాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Health Minister Damodara Raja Narasimha) బహిర్గతం చేశారని కేటీఆర్ అన్నారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన సమావేశంలో దామోదర స్వయంగా అంగీకరించారని తెలిపారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు (implementing complete crop loan waiver in Telangana) చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతుండగా మంత్రి...


